Tips for Black Hair: ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది సర్వసాధారణం అయిపోయింది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు న్యాచురల్ గా పరిష్కారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హెయిర్ ప్యాక్స్ అని చెప్పవచ్చు. అలాంటి హెయిర్ పాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ఆముదం, నువ్వుల నూనె ప్యాక్
ఆముదం అలాగే నువ్వుల నూనె కలిపి తలకు హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకున్నట్లయితే మీ తెల్ల జుట్టు కాస్త నల్లగా మారెందుకు సహాయపడుతుంది ముఖ్యంగా ఇందులో ఉండే మెలనిన్ అనే పోషక పదార్థం మీ జుట్టును నల్లగా ఉంచేందుకు దోహదపడుతుంది.
పెరుగు , మెంతులు ప్యాక్
ఒక కప్పు పెరుగుతో పాటు మూడు చెంచాల మెంతుల పొడిని కలిపి తలకు పేస్టుగా పెట్టుకున్నట్లైతే, మీ జుట్టు రాలిపోయే సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే మీ తెల్ల జుట్టును కూడా నల్లగా మార్చే అవకాశం లభిస్తుంది. వారానికి ఒకసారి . ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మంచిది.
ఆలివ్ ఆయిల్ , హెన్నా ప్యాక్
ఆలివ్ ఆయిల్, హెన్నా ప్యాక్ కలిపి పెట్టుకున్నట్లైతే మీ జుట్టు ఊడిపోకుండా దృఢంగా ఉంటుంది మూలాల నుంచి బలంగా ఉంటుంది. దీంతో పాటు మీ జుట్టు తెల్లగా అవ్వకుండా నల్లగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే సహజమైన పోషకాలు మీ జుట్టును బలంగా ఉండేందుకు దోహదపడతాయి.
కరివేపాకు, కొబ్బరినూనె ప్యాక్
కరివేపాకులను కొబ్బరి నూనెలో మరిగించి, ఆ నూనెను జుట్టుకు రాసుకోవాలి. ఇది తెల్లజుట్టును నెమ్మదిగా నల్లగా మార్చేందుకు దోహదపడుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టును మూలాల నుంచి బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది.
ఆమ్లా , బ్రాహ్మీ పౌడర్ ప్యాక్
ఉసిరికాయల పొడి, బ్రాహ్మీ పొడిని కలిపి జుట్టుకు హెయిర్ ప్యాక్ లా పెట్టుకుంటే మీ జుట్టుకు పోషణ లభిస్తుంది. అంతేకాదు మీ జుట్టు మూలాల నుంచి బలంగా ఉండేలా ఉపయోగపడుతుంది. అలాగే మీ జుట్టు తెల్లగా అవకుండా కాపాడుకునేందుకు ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయ పొడిలో ఉండే విటమిన్ సి మీ జుట్టును సహజసిద్ధంగా నల్లగా మారేలా ఉపయోగపడుతుంది.
అల్లం , హెన్నా ప్యాక్
అల్లం రసం తో పాటు హెన్నా కలిపి తలకు పెట్టుకున్నట్లైతే మీ జుట్టు డాండ్రఫ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు దీంతోపాటు ఇది మీ జుట్టును మూలాలు నుంచి బలపడేలా చేస్తుంది. దీంతో పాటు జుట్టు సిల్కీగా బలంగా మారుతుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.
బీట్‌రూట్ , మెహెందీ ప్యాక్
బీట్‌రూట్ రసం, మెహెందీ కలిపి జుట్టుకు ప్యాక్ పెట్టుకుంటే మీ జుట్టు మారడంతో పాటు సహజసిద్ధంగా రంగు మారుతుంది. అంతేకాదు మీ జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. అలాగే మీ వెంట్రుకలు సహజసిద్ధంగా కాంతిని పొందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









