)
Hair Oiling Mistakes: హెయిర్ ఆయిల్ మన భామ్మల కాలం నుంచి జుట్టుకు కొబ్బరి నూనె వంటివి అప్లై చేస్తూ ఉంటాం. హెయిర్ కేర్ రొటీన్లో కచ్చితంగా జుట్టుకు కొబ్బరి నూనె రాస్తూ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గడమే కాదు.. చుండ్రు సమస్య కూడా దగ్గరికి రాకుండా ఉంటుంది. అయితే మీరు చేసే కొన్ని తప్పిదాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతుంది. జుట్టుకు హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అవి ఏంటో తెలుసుకోండి.
నూనె పెట్టి జుట్టు దువ్వడం..
చాలా మంది తలకు నూనె పెట్టిన వెంటనే తల దూస్తారు. ఇలా చేయడం వల్ల చిక్కుళ్లు పోతాయని అనుకుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అంతేకాదు హెయిర్ బ్రేకేజీ కూడా అవుతుంది అందుకే తలకు నూనె పెట్టిన వెంటనే తల దువ్వకుండా కాస్త ఆగండి. ఆ తర్వాత తలస్నానం చేయండి.
రాత్రంతా అలాగే ఉంచడం..
చాలామంది జుట్టుకు రాత్రంతా నూనె పెట్టి అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేస్తారు. దీనివల్ల మరింత జిడ్డు పెరిగిపోతుంది. ఇది తల దిండుకు కూడా అంటుకుంటుంది. తద్వారా కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. మీరు తలస్నానం చేసే ఒక గంట ముందు హెయిర్ ఆయిల్ పెట్టి ఆ తర్వాత తల స్నానం చేయడం మంచిది. ఎక్కువ సమయం పాటు అలాగే ఉంచవద్దు.
నూనె రాయడం..
చాలా మంది తలస్నానం చేసినా తర్వాత జుట్టుకు నూనె రాస్తారు. తలకు ఇంకా తడి ఆరక ముంద నూనె రాసే అలవాటు ఉంటుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, మృదువుగా మారుతుంది అనుకుంటారు. కొంతమంది జుట్టు చిక్కుల బారిన పడకుండా ఉంటుందని ఇలా చేస్తారు. కానీ అలా చేయడం వల్ల కూడా త్వరగా జుట్టుకి మురికి అంటుకుంటుంది.
ఎక్కువ నూనె రాయడం..
జుట్టుకు హెయిర్ ఆయిల్ ఎక్కువగా రాయడం కూడా మంచి అలవాటు కాదు. అతిగా ఆయిల్ రాయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయనుకుంటారు. కానీ అలా చేయకూడదు. అంతేకాదు తలకు నూనె రాసిన వెంటనే షాంపూతో తల స్నానం చేయడం మంచిది. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
గట్టిగా కట్టడం..
కొంతమంది జుట్టును గట్టిగా వేసుకొని అలవాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. గట్టిగా జుట్టు వేసుకోవడం వల్ల కూడా జుట్టు కుదుళ్ల నుంచి బలహీన పడిపోతాయి. తద్వారా హెయిర్ ఫాల్ సమస్య పెరిగే అవకాశం కూడా ఉంది.
హెయిర్ వాష్..
హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టు కాస్త ఆరనివ్వండి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. జుట్టుకు గంట ముందు నూనె బాగా మసాజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. నూనె పెట్టిన వెంటనే జుట్టును అల్లకండి. కేవలం కొప్పు మాత్రమే కట్టండి. తద్వారా హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి