Health Benefits Of Dates: ఖర్జూరం ఒక తీపి, పోషకమైన పండు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఖర్జూరంలో అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, విటమిన్ B6 వంటివి ముఖ్యమైనవి. ఈ పోషకాలు శరీరంలోని వివిధ విధులకు తోడ్పడతాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసే ముందు లేదా అలసిపోయినప్పుడు కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల శక్తి లభిస్తుంది. ఖర్జూరంలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దాన్నికి తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల ప్రేగు కదలికలు సాఫీగా జరుగుతాయి.
ఖర్జూరంలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరమైన ఆహారం. క్రమం తప్పకుండా ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఎముకల వ్యాధిని తగ్గించడానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడులోని మంటను తగ్గించి, అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను నష్టం నుంచి కాపాడతాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలకు ఖర్జూరం చాలా ప్రయోజనకరమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ప్రసవ సమయంలో రక్తస్రావం తగ్గించడానికి, గర్భాశయ సంకోచాలను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఖర్జూరంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది ఖర్జూరంలో కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇది అతిగా తినడాన్ని నివారించి బరువు నిర్వహణకు సహాయపడుతుంది. అయితే వీటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం.క్రమం తప్పకుండా ఖర్జూరం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వాపు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటిలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








