Apple Cider Vinegar Benefits In Telugu: పులియబెట్టిన యాపిల్స్ నుంచి తయారు చేసిన రసాన్నే యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) అని అంటారు. ఇది ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో మన పూర్వీకులు దీనిని ఎక్కువ వినియోగించేవారని సమాచారం..ముఖ్యంగా దీనిని ఎక్కువ చక్కెర స్థాయిలను నియంత్రించుకునేందుకు వాడేవారు. అలాగే బరువు తగ్గడానికి, గుండె సమస్యల నుంచి విముక్తి పొందడానికి దీనిని వినియోగించేవారు.. ప్రతి రోజు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలు:
యాపిల్ సైడర్ వెనిగర్ ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ప్రతి రోజు ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రాత్రిపూట దీనిని తీసుకోవడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గడం:
యాపిల్ సైడర్ వెనిగర్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరిచేందుకు కూడా కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఊబకాయం ఉన్న వ్యక్తులు 12 వారాల పాటు ప్రతిరోజూ ఈ డ్రింక్ తీసుకుంటే బరువుతో పాటు శరీర కొవ్వు గణనీయంగా తగ్గాయి.
గుండె ఆరోగ్యం:
యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో తాగడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. అంతేకాకుండా మంచి కొవ్వును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తప్పకుండా యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటును కూడా సులభంగా తగ్గిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు:
ప్రతి రోజు యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ క్రియ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలాగే ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఇది తాగితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా అందిస్తుంది. ఇది గుండెల్లో మంటతో పాటు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









