Jackfruit Benefits: వేసవిలో పనసపండు తింటే ఏమౌంతుంది?

Jackfruit Benefits: క్రమం తప్పకుండా పనసపండు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 18, 2025, 05:35 PM IST
Jackfruit Benefits: వేసవిలో పనసపండు తింటే ఏమౌంతుంది?

Jackfruit Benefits In Telugu: ప్రతి రోజు పనసపండు (Jackfruit) తినడం మంచిదేనా? ఈ పండును అల్పాహారంగా భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వేసవిలో ప్రతి రోజు ఈ పండును తింటే అద్భుతమైన లాభాలు పొందుతారు. అయితే ఈ పనసపండు తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పనసపండు(Jackfruit)లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు  మాంగనీస్, కాపర్, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ కూడా లభిస్తాయి. అలాగే విటమిన్ బి6, విటమిన్ బి9, రైబోఫ్లావిన్, విటమిన్ బి3, పిరిడాక్సిన్ వంటి విటమిన్స్‌ కూడా పుష్కలంగా లభిస్తాయి. పనసలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. 

పనసపండు తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియకు మేలు: 

పనసపండులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.. ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది ప్రేగు కదలికలను సులభతరం చేసి జీర్ణవ్యవస్థను శక్తివంతంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి: 
పనసపండులో ఉండే విటమిన్ సితో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ కణాలను కూడా సులభంగా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే కణాలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. పనసపండు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి,  ఇన్ఫెక్షన్లతో పాటు  వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా సహాయపడుతుంది.

రక్తపోటు సమస్యలు: 
పనసపండులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో లభించే.. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి.. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి పనసపండును ఆహారంలో చేర్చుకోవడం గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

రక్తహీనత సమస్యలు: 
పనసపండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపంతో రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ పనసపండు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజు తింటే అలసటతో పాటు బలహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. పనసపండును తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం నుంచి విముక్తి కలుగుతుంది.

చర్మ సమస్యలకు చెక్‌: 
పనసపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేసి.. యవ్వనంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొన్ని అధ్యయనాల ప్రకారం, పనసపండు తినడం వల్ల ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలైనా సులభంగా తగ్గుతాయని తేలింది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News