Heart Blockage Problem: చాలామందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమందిలో చిన్న వయసులోనే గుండె పాడైపోయి వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. చాలామందిలో హాట్ బ్లాక్ సమస్య ఏర్పడి హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ హార్ట్ బ్లాక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలిపే లక్షణాలతో తప్పకుండా ఎలాంటి రక్త పరీక్ష ఈసీజీ లేకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ హార్ట్ బ్లాక్ సమస్య ఉందో లేదో? ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుండె ఆగిపోవడం..
చాలామంది పిల్లల్లో గుండెలు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోవడం కారణంగా పుట్టినప్పటినుంచి గుండె సమస్యలు వస్తూ ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఈ అనారోగ్య సమస్యలు అనేవి జీవనశైలిపై ఆధారపడి ఉంటాయి. మంచి జీవనశైలిని పాటించే వారిలో ఎలాంటి గుండె సమస్యలు రావని వైద్యులు చెబుతూ ఉంటారు. అదే అనారోగ్యకరమైన జీవన శైలి పాటించే వారిలో ధమనులలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగిపోయి.. రక్త ప్రవాహం సహజంగానే ఆగిపోయే అవకాశాలుంటాయి. దీనివల్ల గుండెకు అనేక అంతరాయాలు ఏర్పడి.. పనిచేయడం ఆగిపోయే అవకాశాలున్నాయి. కొంతమందిలో ఇది వంశపార్యపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చాతి నొప్పి..
చాలామందిలో నడుస్తున్నప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు, తినేటప్పుడు ఎక్కువగా చాతినొప్పి వస్తూ ఉంటుంది. విశ్రాంతి సమయాల్లో కూడా ఛాతిపై భారం నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఛాతిలో అసౌకర్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరికొంతమందిలోనైతే గుచ్చుతున్నట్లు నొప్పి వస్తూ ఉంటుంది. గుండెలోని ధమనులు ఇరుకుగా మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రవాహంలో ఆటంకం ఏర్పడి గుండెల్లో నొప్పులు రావడం ప్రారంభమవుతుంది. దీనిని చాతి నొప్పిగా పిలుస్తారు. నిజానికి ఈ చాతి నొప్పి కూడా గుండె సమస్యకు ఒక లక్షణమని చెప్పవచ్చు.
దవడ నొప్పి
చాలామందిలో జాతిలో కాకుండా దవడతో పాటు ఎడమ చేయి మెడ దగ్గర నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందిలో భుజంతోపాటు మెడ దగ్గర కూడా తీవ్ర నొప్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇది సాధారణ నొప్పులే అని భావించి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి నొప్పులే గుండె సమస్యలకు కారణం అవ్వచ్చు. అంతే కాకుండా హార్ట్ బ్లాక్ సమస్యకు కూడా లక్షణమని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎడమ దవడ విపరీతంగా నొయ్యడం లేదా ఎడమచేతు లాగడం వంటి సమస్యలు తలెత్తితే, ఇది గుండె సమస్యలకు లక్షణమని భావించవచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ లక్షణాలు ఏర్పడి కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
శ్వాస ఆడక పోవడం..
చాలామందిలో అధికంగా శ్రమ చేయడం లేకపోయినప్పటికీ శ్వాస ఆడడంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇది గుండె సమస్యకు ప్రధాన లక్షణమని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా శ్వాస ఆడక పోవడం, అలసట వంటి సమస్యలు తలెత్తితే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం హార్ట్ బ్లాక్ సమస్యకు ప్రధాన లక్షణం కూడా శ్వాస ఆడకపోవడమేనని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శ్వాస ఆడక పోవడం అంటే ఈ లక్షణాలున్న వారు తప్పకుండా గుండెను చెక్ చేయించుకోవడం చాలా మంచిది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









