)
Hibiscus Hair Mask: జుట్టు పెరుగుదలకు మందార కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో తయారు చేసే నూనె అద్భుతం. ఇందులో కెరాటీన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఇది మన హెయిర్ లో కనిపించే ఒక రకమైన ప్రోటీన్. ఇది పోలికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మందారతో తయారుచేసిన హెయిర్ మాస్కు ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా.. అందంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో మందార పువ్వులను ఎండబెట్టి, పొడి చేసి వేడి చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. దీని వారంలో మూడు సార్లు ఉపయోగించాలి.
అదేవిధంగా మందారం మంచి క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. సాధారణంగా షాంపులో ఎక్కువ శాతం కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టును డ్యామేజ్ చేస్తాయి. అయితే మీ జుట్టుకు సహజంగా మెరిసేలా ఒక క్లెన్సర్‌లా పనిచేయాలంటే ప్రతి వారంలో ఒకసారి మందారతో తయారు చేసిన షాంపూ జుట్టుకు అప్లై చేయాలి. మందార పొడిలో శనగపిండి, నీళ్లు వేసి జుట్టుకు బాగా పట్టించి మాస్క్ మాదిరి వేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి ఇది మంచి ప్రయోజనాలను ఇస్తుంది, ఒక షాంపూలా పనిచేస్తుంది.
మందార పువ్వుతో డీప్ కండిషన్ కూడా జుట్టుకి ఇవ్వచ్చు. మందార పొడి జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు గ్లాసీగా, అందంగా కనిపిస్తుంది. పొడి చేసిన మందార పువ్వులను నీళ్లలో కలిపి జుట్టుకు మంచి కండిషనర్ల కూడా ఉపయోగించవచ్చు. ఇది మెత్తని పేస్ట్ చేసుకుని జుట్టంతా పట్టించాలి. ఆ తర్వాత మామూలు నీటితో జుట్టు అంతా కడగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు పాటు సిల్కీగా కనిపిస్తుంది.
మందార పొడిని ఉపయోగించడం వల్ల చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. జుట్టుపై అదనపు నూనె ఉత్పత్తిని ఇది నిర్వహిస్తుంది. తద్వారా చుండ్రు రాకుండా కుదుళ్ల ఆరోగ్యం సమతులం చేస్తుంది. కలబంద మందార పొడి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి జుట్టు అంతటికీ పట్టించి హెయిర్ వాష్ చేయాలి. ఇందులో కావాలంటే మీరు హెన్నా కూడా కలిపి ఉపయోగించవచ్చు.
జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు కూడా మందార పూలతో హెయిర్ మాస్క్ వేసుకోవాలి. ఇందులో విటమిన్ సి, అమైనో ఆసిడ్స్ ఉంటాయి. ఇవి కుదుళ్లకు రక్తసరఫరాను కూడా మెరుగు చేస్తాయి. తద్వారా కుదుళ్ల ఆరోగ్యం బాగుంటుంది. జుట్టుపై అదనంగా ఉత్పత్తి అయ్యే నూనె గ్రహించేసి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మందార పువ్వు పొడి చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook