Patanjali Vs Agricultural: పతంజలి వ్యవసాయ నమూనా గ్రామీణాభివృద్ధికి ఎలా సహాయపడుతుంది?

Patanjali Agricultural Development: పతంజలి వ్యవసాయ నమూనా, స్వామి రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణల "నవ్ హరిత్ క్రాంతి" ద్వారా ఆధునిక సాంకేతికత, సేంద్రీయ పద్ధతులను కలిపి రైతులకు ఆదాయం పెంచడానికి, వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఇది మధ్యవర్తులను తొలగించి రైతులకు నేరుగా లాభం చేకూరుస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 18, 2025, 01:17 PM IST
Patanjali Vs Agricultural: పతంజలి వ్యవసాయ నమూనా గ్రామీణాభివృద్ధికి ఎలా సహాయపడుతుంది?

Patanjali Agricultural Development: పతంజలి వ్యవసాయ నమూనా నేడు భారతీయ గ్రామాల విజయానికి ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోంది. స్వామి రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణల నేతృత్వంలో, పతంజలి "నవ్ హరిత్ క్రాంతి - యాన్ అగ్రో విజన్" అనే కార్యక్రమం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ నమూనాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను కలిపి, రైతులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రయోజనం చేకూర్చేలా సహాయపడుతుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

Add Zee News as a Preferred Source

పతంజలి వ్యవసాయ నమూనా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతం కావడానికి గల కారణాలను పరిశీలిస్తే, అది గ్రామాలను ఎలా సంపన్నంగా మారుస్తుందో తెలుస్తుంది. పతంజలి ఈ విధానం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే నాణ్యమైన విత్తనాలు, తక్కువ ధరకే ఎరువులను అందుబాటులోకి తెస్తుంది. దీని ద్వారా రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటం తగ్గి, భూమి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, పంటల దిగుబడి పెరుగుతుంది.

మధ్యవర్తుల తొలగింపు ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందగలుగుతున్నారు. పతంజలి స్వయంగా అనేక వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం  వాటిని నేరుగా వినియోగదారులకు చేర్చడం వల్ల రైతులకు సరైన ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా, పతంజలి ఆహార శుద్ధి పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

పతంజలి  "నవ్ హరిత్ క్రాంతి" కేవలం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం మాత్రమే కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షించడం, గ్రామీణ సమాజాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమగ్ర విధానం వల్లనే పతంజలి వ్యవసాయ నమూనా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమై, వాటిని సంపన్నంగా మారుస్తోంది.

సేంద్రీయ వ్యవసాయాన్ని సాంప్రదాయ అనుభవం:

పతంజలి వ్యవసాయ నమూనా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారిస్తూ, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి స్ఫూర్తి పొందింది. ఈ నమూనా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేందుకు రైతులకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. పతంజలి రైతులకు అందుబాటు ధరలో సేంద్రీయ ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తూ వారి వ్యయాలను తగ్గించి ఆదాయాన్ని పెంచుతుంది. ఈ నమూనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుర్వేదం, సాంప్రదాయ వ్యవసాయ విధానాలను సమన్వయం చేస్తుంది. ఇది రైతుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా, మన వ్యవసాయ సంస్కృతిని కూడా పరిరక్షిస్తుంది. పతంజలి  ఈ ప్రయత్నాలు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ భారతీయ వ్యవసాయ రంగ భవిష్యత్తుకు ఒక నూతన మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి.

సాంకేతిక ఆవిష్కరణ VS రైతు సాధికారత:

రైతులకు తోడ్పాటునందించేందుకు పతంజలి ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ క్షేత్రాలకు జియో-మ్యాపింగ్, జియో-ఫెన్సింగ్, అలాగే వాతావరణ సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కంపెనీ ప్రత్యేకమైన యాప్‌లను రూపొందించింది. ఇది వారి పంటలను మరింత మెరుగ్గా సంరక్షించుకోవడానికి, మార్కెట్‌లోని ఒరవడులను ఎప్పటికప్పుడు గమనించడానికి ఉపకరిస్తుంది. అంతేకాకుండా రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి కూడా పతంజలి ప్రయత్నిస్తోంది. వారి 'నవ్ హరిత్ క్రాంతి - యాన్ ఆగ్రో విజన్' అనే కార్యక్రమం ద్వారా రైతులు నేల స్వభావాన్ని పరీక్షించుకోవడం, వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయడం,  పీఎం-కిసాన్ యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడం వంటి వాటికి సహాయపడుతుంది. ఈ ప్రయత్నాల ద్వారా, పతంజలి రైతులు అభివృద్ధి చెందడానికి కావలసిన పనిముట్లను, అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ వారిని శక్తివంతులుగా చేస్తోంది. దీంతోపాటు గ్రామీణ భారతదేశం, సమగ్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతోంది.

ఇదీ చదవండి:  స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News