Dibba Rotti: దిబ్బ రొట్టెను ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..
Dibba Rotti Recipe: దిబ్బ రొట్టి అనేది ఆంధ్రా వంటకం. దీని కొందరు మినప రొట్టె అని కూడా పిలుస్తారు. దిబ్బ రొట్టిని బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే దీని కొబ్బరి, టొమాటో , మామిడి, అల్లం చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Dibba Rotti Recipe: దిబ్బ రొట్టి అనేది ఉరద్ పప్పు,బియ్యం రవ్వచ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఆహారం. ఇది తినడానికి ఎంతో రుచిగా, మెత్తగా ఉంటుంది. దీని బ్రేక్‌ఫాస్ట్‌గా, లేదా ఫ్రీ టైమ్‌లో చేసుకొని తినవచ్చు. అయితే దిబ్బ రొట్టి అనే పేరు ఎలా వచ్చింది అంటే.. తెలుగులో దిబ్బ అంటే మందపాటి, లావుగా ఉండేది అని ఆర్థం. ఈ రొట్టె లావుగా ఉంటుంది కాబట్టి దిబ్బరొట్టి అనే పేరు వచ్చింది.
సాంప్రదాయకంగా దిబ్బ రొట్టిని లోతైన కాస్ట్ ఇనుప కడైలో తయారు చేస్తారు. ఇది ఒకసారి చేసిన తర్వాత వంటకం మౌంట్ ఆకారాన్ని ఇస్తుంది. చాలా మంది పిల్లలు మినప రొట్టె యొక్క క్రస్ట్‌ను ఇష్టపడతారు. దీని ఊరగాయతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు దీని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. దీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని చేసుకోవడం ఎంతో సులభంగా కూడా. అయితే దీని కోసం మీరు ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం..
దిబ్బరొట్టెకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల మినప్పప్పు
ఒక కప్పు ఇడ్లీ రవ్వ
కావలసినంత నూనె
దిబ్బ రొట్టె తయారీ పద్ధతి:
మినపప్పు ఉదయం రాళ్ళు లేకుండా శుభ్ర పరచి నీళ్ళలో బాగా కడిగి నానబొయ్యాలి. సాయంత్రం నీళ్ళు వంపేసి చాలా కొద్ది నీటిని జతచేస్తూ మిక్సీలో రుబ్బాలి. ఈ పిండిని లోతు గిన్నెలో మూతవుంచి రాత్రంతా అట్టిపెడితే పొంగుతుంది. మర్నాడు ఉదయం స్టవ్మీద లోతయిన బాణలి పెట్టి నూనె కాస్త ఎక్కువ వేసి ఈ పిండిని గుండ్రంగా బాగా మందంగా పొయ్యాలి. పైన మూత పెట్టి అందులో నీళ్ళు పొయాలి. కొద్దిసేపయిన తర్వాత అడుగున దోరగా కాలగానే తిప్పి మళ్ళా వేయించాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి చాకుతో నాలుగు భాగాలుగా ముక్కలు కోయాలి. ఇది పంచదారతో కాని, కొత్తిమీర కారంనంజుకుంటూగాని తినాలి. ఇది ఒంటికి మంచిదని పెద్దలు చెబుతారు.
Also Read Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter