Instant Stress Relief & Anxiety Tips: ఒత్తిడితో సతమతం అవుతున్నారా..? వీటితో తక్షణం ఉపశమనం పొందొచ్చు
How To Manage Stress & Anxiety: ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ కింది ఆయుర్వేద మూలికలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6 Secrets For Instant Stress & Anxiety Relief Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మంది దీని కారణంగా బీపీ వంటి తీవ్ర దీర్ఘకాలీక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగానూ మరే అవకాశాలున్నాయి. అయితే ఈ ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించడం చాలా మంచిది. వాటి వినియోగించడం వల్ల సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడిని తగ్గించే ఆయుర్వేద నివారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గించే మూలికలు:
అశ్వగంధ:
అశ్వగంధ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల సులభంగా ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బ్రహ్మి:
బ్రహ్మీకి ఆయుర్వేదంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని టీ తయారు చేసి తాగడం వల్ల ఒత్తి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు.
జటామాంసి:
జటామాంసి మూలిక కూడా ఒత్తిడిని తగ్గించేందుతకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని పౌడర్‌గా చేసుకొని వేడి నీళ్లతో కలుపుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యోగా, ప్రాణాయామం:
ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర దృఢంగా తయారవుతుంది.
ఆవ నూనె:
ఆవ నూనె శరీరంలోని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని నాభిపై అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి:
తులసి టీని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వల్ల అన్ని రకాల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు
Also read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook