Ginger And Garlic Paste Store: అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే ఏ కర్రీ తయారు చేయలేము. ఇది వంటకు మంచి సువాసన అందించడం. ఇది రుచికరంగా ఉంటుంది, సువాసన కూడా బాగుంటుంది, ఇందులోని ఔషధ గుణాలు మనకు అందుతాయి. మార్కెట్ నుంచి తీసుకురాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవుతుందని ఫ్రిడ్జ్‌లో పెడతారు. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసింది మార్కెట్ నుంచి తీసుకోవడం వల్ల హానికరం. ఇందులో ఎక్కువగా కెమికల్స్ ఉపయోగిస్తున్నారు.. దీనికి బదులుగా అల్లం వెల్లుల్లి తీసుకువచ్చి మంచి గ్రైండ్ చేసుకొని పేస్ట్ నిల్వ చేసుకోవాలి
అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ విధానం..
ముందుగా అల్లం తీసుకొని దాని శుభ్రంగా మట్టి మొత్తం పోయేలా కడిగి దాన్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. శుభ్రంగా ఆరిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక వెల్లుల్లి కూడా పూర్తిగా పొట్టు తొలగించాలి.. ఈ రెండిటిని సమపాళ్లలో మిక్స్ చేసి అందులో నూనె, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల మేలు ఈ గాజు సీసాను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది.
అల్లం వెల్లుల్లి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. ఇది ఆరోగ్యకరం, మంట నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెడుతుంది.
అల్లం వెల్లుల్లి మన డైలీ డైట్ లో ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. వ్యాధుల నుంచి బయటపడేలా ప్రేరేపిస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ డామేజ్ కాకుండా కాపాడుతాయి సెల్ డామేజ్ కాకుండా నివారిస్తాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్త సరఫరాను మెరుగు చేసి మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు అల్లం వెల్లుల్లి షుగర్ ని కూడా నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. అల్లం వెల్లుల్లి తీసుకోవడం వల్ల రొంప సమస్యలకు కూడా ముఖ్యంగా ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి అని కొన్ని నివేదికలు తెలిపాయి
ఇదీ చదవండి: క్రికెట్ లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో హాట్‌స్టార్ కూడా ఉచితం..
అల్లం వెల్లుల్లి మన శరీరం ఖనిజాలను గ్రహిస్తుంది. దీంతో మన ఆహారానికి అదనపు బెనిఫిట్స్. మరింత ప్రయోజనం అయితే అల్లం వెల్లుల్లిని సరిగ్గా పేస్ట్ మాదిరి తయారు చేసుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకోవడం వల్ల ఒక నెలపాటు పాడవకుండా ఉంటుంది.. ముఖ్యంగా గాలి చొరబని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని నెలల పాటు కూడా పాడవ్వకుండా ఉంటుంది. గాలిచొరబడని సీసాలో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నిల్వ చేయడం వల్ల ఆక్సిడేషన్ నివారిస్తూ ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండేలా చేస్తుంది.. అయితే అల్లం వెల్లుల్లి తయారు చేసుకునేటప్పుడు నీరు కొద్ది మొత్తంలో మాత్రమే వాడాలి ఎక్కువ నీళ్లు ఉపయోగించకూడదు.
ఇదీ చదవండి: తిరుమల దర్శనాలపై భక్తులకు అలెర్ట్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు, టీటీడీ చైర్మన్ సీరియస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









