Hydrated Veggies: ఎండ వేళ కడుపును చల్లబరిచే కూరగాయలు.. ఇమ్మూనిటీ పెంచి, షుగర్‌ నియంత్రిస్తాయి..

Hydrated Veggies In summer: మండే ఎండ వేడిమి పెరిగిపోతుంది. ఏప్రిల్, మే నెలలో ఇదే పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుతున్న నేపథ్యంలో మన శరీరాన్ని హైడ్రేషన్ గా ఉంచుకోవాలి. ఐదు రకాల ఫుడ్స్ తీసుకుంటే రోజంతటికి కావలసిన చల్లదనం అందుతుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 18, 2025, 11:02 AM IST
Hydrated Veggies: ఎండ వేళ కడుపును చల్లబరిచే కూరగాయలు.. ఇమ్మూనిటీ పెంచి, షుగర్‌ నియంత్రిస్తాయి..

Hydrated Veggies In summer: రోజంతా హైడ్రేషన్ అందించే ఫుడ్స్ ఎండ వేళ తీసుకోవాలి. తద్వారా ఆరోగ్య సమస్యలు రావు. ప్రధానంగా డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు చేర్చుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటారు. అంతే కాదు ఇందులో ఖనిజాలు కూడా పుష్కలం. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితో మనం రెగ్యులర్ గా తింటే మంచిది ,

Add Zee News as a Preferred Source

కీర దోసకాయ ఎండ వేళలో కీరదోసకాయ డైట్లో చేర్చుకుంటే మంచి తాజాదనం అందిస్తుంది. దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. నేరుగా కూడా తినవచ్చు 95% పైగా నీరు ఇందులో ఉంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ప్రధానంగా విటమిన్ కే, క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సమతుల ఆహారం అవుతుంది. పెరుగు రైతాలో కూడా వీటిని తీసుకోవచ్చు. 

సొరకాయ తీసుకోవడం వల్ల కూడా మంచి హైడ్రేషన్ అందుతుంది. ఇందులో ఖనిజాలు పుష్కలం. కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి మంచిది సొరకాయను సాంబార్‌లో వేసుకొని తినవచ్చు. దీంతో స్వీట్ కూడా తయారు చేసుకుంటారు. రైతాలో కూడా వేసుకుని తింటే మంచి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం ఎందులో ఉంటుంది. షుగర్ లెవెల్స్ అతిగా పెరగకుండా చేస్తుంది. 

బీరకాయలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండవేళ మన డైట్ లో చేర్చుకోవాలి. అంతే కాదు ఇందులో ఫైబర్ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బీరకాయలు విటమిన్ ఏ, సీ, ఐరన్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బీరకాయలో ఉండే బీటా కెరోటీన్‌  కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. 

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌.. ఈ చిన్న పనిచేస్తే రూ.2000 మీ ఖాతాల్లో పడిపోతాయి..  

కాకరకాయ చాలామంది తినకుండా ఉంటారు. కానీ ఇందులో అద్భుత పరియోజనాలు ఉంటాయి. ఇందులో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండవేళ మన డైట్ లో చేర్చుకుంటే ఇందులో కేలరీలు తక్కువ.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలనుకునేవారు కాకరకాయ తినాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. తద్వారా ఇమ్యూనిటీని బలపరుస్తుంది.అంతేకాదు డయాబెటిస్ వారికి ఇది మంచి కూరగాయ అని చెప్పొచ్చు. 

గుమ్మడికాయ తీసుకోవడం వల్ల 90% పైగా నీరు అందుతుంది. మన శరీరం చల్లదనంతో ఉంటుంది. హైడ్రేషన్ మన శరీరానికి అందుతుంది. ఇందులో విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. జీవన ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు గుమ్మడికాయను తీసుకోవాల్సిందే. దీన్ని సాంబార్లో తీసుకోవచ్చు లేదా సూప్ రూపంలో తయారు చేసుకుంటారు ఎండవేళ కడుపు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. వీరికి కోరుకున్న ఉద్యోగం, పట్టిందల్లా బంగారం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News