
Magical Benefits Of Dal Water: ప్రతి ఇంట్లోనూ పప్పు ఒక ముఖ్యమైన ఆహార పదార్థం. కానీ, ఉడికించిన తర్వాత మిగిలిపోయే నీటిని చాలా మంది పారబోస్తారు. అయితే ఆ నీటిలో పప్పులోని అన్ని పోషకాలు ఉంటాయని అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
పప్పు నీటిలో బోలడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి సహాయపడుతాయి. ఈ పప్పు నీరు తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల రక్త హీతన సమస్య కలగదు. ఈ నీరు రక్త కణాల పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ నీరు ఉపయోగపడుతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు పప్పు నీటిని ఉపయోగించవచ్చు. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈ నీరు కొలన్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం అధిక బరువు సమస్య ప్రతిఒకరిని వేధిస్తుంది. దీని కోసం మీరు ఎలాంటి మందులు ఉపయోగించాల్సి అవసరం లేదు. డైట్లో పప్పును ఉపయోగించే అప్పుడు ఈ నీటిని కూడా తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో అలాగే మంచి కొవ్వును పెంచడంలో సహాయపడుతుంది.
ఈ పప్పు నీరు కిడ్నీల్లో రాళ్లను కరిగించడానికి ఎంతో సయపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీనిని వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా, మెరుగుగా పనిచేస్తాయి. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మంకు ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉపయెగించడం వల్ల చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. పప్పు నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో, అనారోగ్య సమస్యలతో పోరడడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
పప్పు నీటి తయారీ విధానం:
ముందుగా అర కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి, ఒక కుక్కర్లో వేసి నీరు, ఉప్పు, పసుపు వేసి 5 విజిల్స్ పెట్టుకుని ఉడికించాలి. ఉడికిన తర్వాత, నీటిని వేరు చేసి, అందులో వెల్లుల్లి, ఇంగువ వేసి వేయించాలి. ఈ పప్పు నీటిని తాగవచ్చు లేదా సూప్‌లు, కూరలలో వాడవచ్చు.
చిట్కాలు:
కందిపప్పు మాత్రమే కాకుండా, శనగపప్పు, మినపప్పు వంటి ఇతర పప్పులతో కూడా ఈ నీటిని తయారు చేసుకోవచ్చు.
పిల్లలకు ఈ పప్పు నీటిని తాగించడం వల్ల వారి ఎముకలు, దంతాలు బలంగా అభివృద్ధి చెందుతాయి.
రోజూ ఒక గ్లాసు పప్పు నీరు తాగడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఏదైనా కొత్త ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe