Jackfruit Juice Benefits In Telugu: పనస పండులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 (పైరిడాక్సిన్), నియాసిన్ (విటమిన్ బి3)తో పాటు రైబోఫ్లావిన్ (విటమిన్ బి2) పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనితో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవి కాలం ప్రతి రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా దూర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఐరన్, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ పనస పండు రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పనసపండు రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
1. రోగనిరోధక శక్తి:
పనస పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రోగనిరోధక వ్యవస్థను శక్తివంతగా చేస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా పనస పండు జ్యూస్ తాగడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పాటు వివిధ వ్యాధులతో పోరాడటానికి హాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభంగా పెంచుతుంది.
2. జీర్ణక్రియ సమస్యలు:
పనస పండు జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో లభించే ఫైబర్ పేగు కదలికలను సులభతరం చేస్తుంది. దీని కారణంగా ఆహారం సజావుగా జీర్ణమవుతుంది. రోజు పనస పండు జ్యూస్ తాగడం వల్ల పొట్ట కూడా ఆరోగ్యంగా తయారువుతుంది. దీని కారణంగా దీర్ఘకాలిక పొట్ట సమస్యలు కూడా తొలగిపోతాయి.
3. రక్తపోటును నియంత్రిస్తుంది:
పనస పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీంతో ఈ జ్యూస్ తాగడం వల్ల సోడియం స్థాయిల సముతుల్యత అవుతుంది. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే తీవ్ర గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి.
4. కంటి సమస్యలు:
పనస పండులో విటమిన్ ఎతో పాటు బీటా-కెరోటిన్ వంటి పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి.. ఇవి కంటిని ఆరోగ్యంగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
5. చర్మాన్ని సమస్యలు:
పనస పండు జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మాన్ని యవ్వనంగా..ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి తేమ అందడమే కాకుండా మెరిసేలా చేస్తుంది. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తపకుండా డైట్‌లో ఈ జ్యూస్‌ని చేర్చుకోవాల్సి ఉంటుంది.
6. ఎముకల సమస్యలు:
పనస పండు జ్యూస్‌లో కాల్షియంతో పాటు మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి.. ఇవి ఎముకలను బలంగా.. శక్తివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పనస పండు జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే బోలు ఎముకల సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









