Jackfruit Benefits Facts In Telugu: చాలా రెగ్యులర్‌గా లభించే పండ్లలో పనస పండు కూడా ఒకటి.. ఇందులో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు, ఖనిజాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి అల్పాహారంతో పాటు దీనిని డిన్నర్ లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పనసపండులో విటమిన్లు (విటమిన్ సి, విటమిన్ బి6), ఖనిజాలు (పొటాషియం, మెగ్నీషియం)తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. దీనిని తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఇవే కాకుండా శరీరానికి బోలెడు ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ క్రియకు మేలు:
పనస పండులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు.. అవసరమైన రసాయనాలను అందించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే మలబద్ధకం వంటి సమస్యను నివారించేందుకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచేందుకు:
జాక్ ఫ్రూట్ రోజు తింటే శరీరానికి పుష్కలంగా విటమిన్ సి లభిస్తుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల వ్యాధులనుంచి శరీరాన్ని కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ఈ జాక్ ఫ్రూట్ ని ఎండాకాలం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు:
రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా పనసపండు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు పూర్తిగా రక్తంలోని చక్కర పరిమాణాలపై ప్రభావం చూపి వాటిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి వివిధ రకాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి..:
పనస పండులో పొటాషియం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు కీలక పాత్ర పోషించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా జాక్ ఫ్రూట్ తినడం ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్ అయిన వారు తప్పకుండా ఈ ఫ్రూట్ ని అల్పాహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ఎముకల ఆరోగ్యానికి:
పనస పండులో ఉండే మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న వారు రోజు అల్పాహారంలో భాగంగా పనస పండును చేర్చుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఉండే గుణాలు బలహీనమైన ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









