Jonna Roti For Weight Loss: ఆధునిక జీవనశైలి అనుసరించే చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి చాలామంది బరువు పెరగడం, మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు మధుమేహం బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతోంది. దీంతో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. చాలామంది డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా అన్నాన్ని తింటున్నారు. అలాగే మరి కొంతమంది అయితే గోధుమపిండితో తయారుచేసిన రోటీలను తింటున్నారు. నిజానికి వీటన్నింటికీ బదులుగా జొన్నలతో తయారుచేసిన  రోటీలను ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు. అయితే సులభంగా ఇంట్లోనే ఈ జొన్న రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జొన్న రొట్టె తయారీకి కావలసిన పదార్థాలు:
2 కప్పుల జొన్న పిండి
1/2 టీస్పూన్ ఉప్పు
1 టేబుల్ స్పూన్ నూనె
నీరు (అవసరానికి తగినంత)


తయారీ విధానం:
ముందుగా ఈ జొన్న రొట్టెలను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ పెద్ద బౌల్ లో జొన్న పిండి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, మెత్తటి పిండిగా కలుపు కోవాల్సి ఉంటుంది. చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకుండా తప్పకుండా చూస్కోండి.
ఇలా బాగా విశ్రమంలో తయారు చేసుకున్న పిండిని 10 నిమిషాలు పాటు బౌల్ పై మూత పెట్టి నానబెట్టాలి.
ఒక ముద్ద పిండిని తీసుకొని, చేతిలో చిన్నగా ఉండగా చేసుకోవాలి.
పిండి ముద్దలు అన్నిటిని గుండ్రని చపాతీ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
ఆ తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని బాగా దానిని వేడి చేసి తయారు చేసుకున్న చపాతీలను కాల్చుకోవాలి. 
ఇలా అన్నింటిని గోధుమ రంగు వచ్చేంతవరకు బాగా కాలుచుకొని సర్వ్ చేసుకోవచ్చు.


చిట్కాలు:
గోధుమ రొట్టెలు మరింత రుచిగా ఉండడానికి కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి, ఇంగువను కూడా పిండిలో వేసుకోవచ్చు. 
జొన్న రొట్టె మరింత మృదువుగా ఉండడానికి పిండిని రాత్రంతా నానబెట్టి ఉంచవచ్చు. 
జొన్న రొట్టె మరింత హెల్తీగా పొందడానికి ప్యాకెట్లలో లభించే పిండి కాకుండా నేరుగా జొన్నలను పిండిగా తయారు చేసుకొని చపాతీలను చేసుకోండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి