Lemon Tea Benefits In Telugu: వేసవిలో లెమన్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
లెమన్ వాటర్‌లో ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా రోజు లెమన్ టీ తాగితే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
ఎండకాలంలో లెమన్ టీ తాగితే హైడ్రేషన్ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే ఐరన్ లోపాన్ని కూడా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందు కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు:
లెమన్ టీలో ఉండే ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. ఈ టీని తాగడం వల్ల అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేదుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేసి, శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు కూడా లభిస్తాయి.
శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది:
ప్రతి రోజు వేసవిలో లెమన్ టీ తాగడం వల్ల సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను స్థాయిలను తగ్గించేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం కోసం:
లెమన్ టీలో ఉండే రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే సహజ శక్తిని అందిస్తుంది. ఇవే కాకుండా గొంతు నొప్పి, శ్వాసకోస సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









