Cucumber Juice Benefits: వేసవిలో దోసకాయ రసం తాగితే.. దిమ్మతిరిగే లాభాలు..

Cucumber Juice Benefits In Summer Season: వేసవిలో దోసకాయ రసం ఉదయాన్నే తాగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 19, 2025, 02:05 PM IST
Cucumber Juice Benefits: వేసవిలో దోసకాయ రసం తాగితే.. దిమ్మతిరిగే లాభాలు..

Cucumber Juice Benefits In Summer Season: వేసవిలో దోసకాయ రసం తాగడం మంచిదేనా? నిజానికి ప్రతి రోజు ఉదయం ఈ రసం తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి విటమిన్స్‌ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ రసం తాగడం వల్ల బి విటమిన్లు (బి1, బి2, బి3, బి5, బి6, బి9) కూడా అధిక పరిమాణంలో శరీరానికి అందుతాయి. దోసకాయ రసం ఉదయాన్నే తాగడం వల్ల పొటాషియం, మెగ్నీషియంతో పాటు కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్లు, టానిన్స్‌తో పాటు లిగ్నన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి వేసవిలో ఈ దోసకాయలతో తయారు చేసిన రసం తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Add Zee News as a Preferred Source

దోసకాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
1. శరీరానికి నీరు లభిస్తుంది:

దోసకాయ రసంలో 95 శాతం పాటు నీరు ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దోసకాయ రసం తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ దోసకాయ రసం తాగడం వల్ల శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పకుండా ఈ రసం తీసుకోవాల్సి ఉంటుంది.

2. బరువు తగ్గడానికి..: 
దోసకాయ రసంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక గ్లాసు దోసకాయ రసంలో కేవలం 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. ఇది కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ ఆహారం తీసుకోకుండా చూస్తుంది. దీని వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

3. చర్మానికి మేలు: 
దోసకాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు, సిలికా వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సిలికా చర్మంలోని కణాలను శక్తవంతంగా చేసి..చర్మాన్ని మెరిసేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దోసకాయ రసం తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది మరియు ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.

4. జీర్ణక్రియ సమస్యలు: 
దోసకాయలో ఫైబర్‌తో పాటు నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు దోసకాయ రసం ఉదయాన్నే ఒక గ్లాసు తాగితే గొప్ప ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా పొట్టలోని మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. 

5. రక్తపోటును నియంత్రిస్తుంది: 
దోసకాయ రసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ దోసకాయ రసం తాగడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News