Happy Maha Shivratri Wishes And Messages 2025: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి రోజున హిందువులు ప్రతి ఒక్కరు మహాశివుడిని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలంతా శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. ఈరోజు ప్రత్యేకమైన ఉపవాసాలతో పాటు జాగరణ చేయడం వల్ల ఎన్నో పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే మహాశివరాత్రి రోజున శివపార్వతులకు కళ్యాణ కార్యక్రమాలు కూడా చేపడతారు. భక్తిశ్రద్ధలతో కళ్యాణ కార్యక్రమాలు చేపట్టి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున శివాలయంలో మహాలింగానికి చేయడం ఎంతో మంచిది. ఇంతటి పవిత్రత కలిగిన పండగ రోజున ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ.. మీకు మేలుకోరే మిత్రులకు కుటుంబ సభ్యులకు ఇలా మహాశివరాత్రి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా పంపండి.
హర హర మహాదేవ శంభో శంకర.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి తో పాటు ఆనందం, శ్రేయస్సును నింపాలని ఆ మహాశివుడుని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
ఓం నమశ్శివాయ.. మహాశివరాత్రి పండగ రోజున ఆ పరమేశ్వరుల దీవెనలు కలిగి మీ కుటుంబం సుఖశాంతులతో జీవించాలని కరుణాకటాక్షంతో ఎల్లవేళలా ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ❊మహాశివరాత్రి ప్రత్యేక శుభాకాంక్షలు❊
మహాశివరాత్రి రోజున ఆ శివపార్వతుల అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ ❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
మహా శివుడి అనుగ్రహం మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మీ కుటుంబ సభ్యులందరికీ ❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
ఈ మహాశివరాత్రి రోజున మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా బాగుండాలని, కష్టాలు తొలగిపోయి సుఖాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా ❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
శివుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని కోరుకుంటూ.. ఈ శివరాత్రి సందర్భంగా మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ మహా శివుడిని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ..❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
మహాశివరాత్రి సందర్భంగా మీ జీవితంలో కొత్త వెలుగు నిండాలని.. మానసిక ప్రశాంతతతో జీవితం ముందుకు సాగించాలని కోరుకుంటూ.. ❊మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
శివుడి నామస్మరణతో మనస్సు ప్రశాంతంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ.. ❊హరహర మహాదేవ శంభో శంకర❊
శివుడి దీవెనలతో ప్రతి పనిలో విజయాలు సాధించాలని, జీవితంలో వస్తున్న కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని ఆ మహా శివుడిని మనసారా కోరుకుంటూ.. ❊మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు❊
శివుడి అనుగ్రహం తో మీ జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని.. పనుల్లో వస్తున్న ఆటంకాలు తొలగిపోయి.. కెరీర్ బాగుండాలని కోరుకుంటూ.. ❊ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ❊
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









