కితకితలు పెట్టే మీమ్ ఎలా పుట్టిందో తెలుసా?

అందరి ధ్యేయం మాత్రం ఒత్తిడిని జయించడమే. గతంలో జోక్స్‌ను ఒత్తిడిని చిత్తు చేసేందుకే వాడేవారు. ప్రస్తుతం మనం రకరకాల మీమ్స్‌ను వాడుతున్నాం.

Updated: Mar 26, 2020, 05:39 PM IST
కితకితలు పెట్టే మీమ్ ఎలా పుట్టిందో తెలుసా?
Image Credit: Helo

ఒత్తిడిని అధిగమించేందుకు ఒక్కో వ్యక్తి ఒక్కో పని చేస్తుంటారు. ఓ వ్యక్తి పాటలు వినేందుకు ఆసక్తి చూపిస్తే, మరో వ్యక్తి డ్యాన్స్, ఇంకొకరు స్విమ్మింగ్, పుస్తకాలు చదవడం.. ఇలా ఒక్కొక్కరది ఒక్కో తీరు. కానీ అందరి ధ్యేయం మాత్రం ఒత్తిడిని జయించడమే. గతంలో జోక్స్‌ను ఒత్తిడిని చిత్తు చేసేందుకే వాడేవారు. ప్రస్తుతం మనం రకరకాల మీమ్స్‌ను వాడుతున్నాం. ఈ తరం పిల్లలకు జోక్స్ కన్నా మీమ్స్ అంటేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా నేడు మీమ్ క్రియేటర్స్ డే (Meme Creators Day).

అదేంటి ఇలాంటి ఒకరోజు ఉందని మీకు తెలుసా. ఈ రోజు ఎప్పుడు జరుపుకుంటారని ఆలోచిస్తున్నారు కదూ. గతంలో ఫన్నీ కార్టూన్లు, పెయింటింగ్స్, జోక్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ తరహాలోనే వచ్చిన జోక్స్‌కు మీమ్  (Meme), మీమ్స్ అని యూకేకు చెందిన రిచర్డ్ డాకిన్స్ కొత్త పేరు కనిపెట్టారు. నేడు (మార్చి 26న) ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘మీమ్ క్రియేటర్స్ డే’గా జరుపుకుంటారు. ప్రస్తుతం టెన్షన్ జీవితంలో మన ఒత్తిడిని మటుమాయం చేయడానికి మీమ్స్ చూస్తుంటాం.  See Photos: కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్

Image Credit: wikipedia

ఆ మీమ్స్ అనే పేరు కనిపెట్టిన యూకేకు చెందిన రచయిత, ఇంగ్లీష్ ఎథాలజిస్ట్, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ రిచర్డ్ డాకిన్స్ పుట్టినరోజును మీమ్ క్రియేటర్స్ డే అని వ్యవహరిస్తున్నాం. మీరు మీ మిత్రులకు, సన్నిహితులకు Happy Meme Creators Day విషెస్ చెప్పండి. ఈరోజు మీమ్ క్రియేటర్ డే ఎలా వచ్చిందో తెలపండి. 1974లో ఆయన రచించిన ద సెల్ఫిష్ జిన్ అనే పుస్తకంలో తొలిసారి మీమ్ అనే పదాన్ని వాడారు. అనంతరం మీమ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!

నైరోబీ, బ్రిటీష్ కెన్యాకు చెందిన తల్లిదండ్రులకు మార్చి 26 1941లో జన్మించారు క్లింటన్ రిచర్డ్ డాకిన్స్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, డి.ఫిల్ పూర్తి చేశారు. ఆయనకు 1989లో ZSL Silver Medal, 1990లో Michael Faraday Prize, 1997లో International Cosmos Prize, 2001లో FRS, 2009లో Nierenberg Prize వరించాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్