Milk For Hair Growth: జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు పాలు తాగితే బెట్టర్ అని అంటున్నారు. అయితే పాలు తాగితే జుట్టు పెరుగుతుందా? ఇందులో నిజమెంత? పాలలో ఖనిజాలు పుష్కలం. ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా పాలు తీసుకోవడం వల్ల మనకు క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి అందుతుంది. అయితే మంచి చర్మ ఆరోగ్యానికి తో పాటు గోళ్ళు, జుట్టు పెరుగుదలకు కూడా ఇది ప్రేరేపిస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వెంటనే ఫలితాలు చూపించకున్నా హెయిర్ పెరుగుదలకు పాలు కీలకపాత్ర పోషిస్తాయి.
పాలలో కేసెయిన్ ఉంటుంది. వే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో త్వరగా గ్రహిస్తుంది. దీంతో కెరటీన్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. రెగ్యులర్‌గా పాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది. ఇది ఎముకలతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రతిరోజు పాలు తాగడం వల్ల మన శరీరానికి రెగ్యులర్ గా ప్రోటీన్ అందుతుంది. దీంతో జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. హార్మోన్ సమతుల్యతకు పాలు తీసుకోవాలి.
పాలలో ప్రోటీన్‌తోపాటు కొన్ని రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. విటమిన్ డి ఇది ఆరోగ్యకరమైన హెయిర్ ఫోలికల్స్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. కానీ నివేదికల ప్రకారం విటమిన్ డి తగ్గడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఇది అలోపేషియాకు కూడా దారితీస్తుంది.
ఇదీ చదవండి : Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే వేసవిసెలవులు ప్రారంభం..
పాలలో విటమిన్ బి కూడా ఉంటుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో హెయిర్ ఫాలికల్స్‌కు ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. విటమిన్ ఏ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది దీంతో కుదుళ్లకు మాయిశ్చర్ అంది ఆరోగ్యంగా పెరుగుతాయి.
పాలు తాగగానే జుట్టు పెరిగిపోదు.. కానీ ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అందటం వల్ల హెయిర్ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. క్యాల్షియం వల్ల కూడా జుట్టు బలంగా మారుతుంది. పాలలో ఉండే కరిగే ఫైబర్ జుట్టు పెరుగుదలకు బూస్టింగ్ ఇస్తాయి. కాల్షియం లెవెల్స్ సమతుల్యం చేస్తుంది. పాలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టీరన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవి సహజంగా పాలలో కనిపిస్తాయి. రెగ్యులర్‌గా పాలు తీసుకోవడం వల్ల హార్మోన్ అసమతుల్యను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి : Earthquake: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









