Minapa Dibba Rotti: మినప దిబ్బరొట్టె రెసిపీ.. ఈ చిట్కాలు పాటిస్తే స్పంజ్లా వస్తుంది!
Minapa Dibba Rotti Recipe: మినప దిబ్బరొట్టెను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Minapa Dibba Rotti Recipe: మినప దిబ్బరొట్టెకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకం. దీనిని గోధుమతో పాటు మినప పిండితో తయారు చేస్తారు. అలాగే ఈ రెట్టెను కాల్చేందుకు నెయ్యిని వినియోగిస్తూ ఉంటారు. దీనిని సాంబార్‌తో కలిపి తీసుకుంటే భలే రుచి ఉంటుంది. ఈ దిబ్బరొట్టేను పల్లె ప్రాంతాలకు చెందిన వంటకంగా భావిస్తారు. ఇందులో శరీరాకి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అల్పాహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి బోలేలు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తక్కువ బరువు సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ రెసిపీ ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ మినప దిబ్బరొట్టె ఎలా తయారు చేసుకోవాలో? దీని కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మినప దిబ్బరొట్టె కావాల్సిన పదార్థాలు:
మినప పిండి - 1 కప్పు
అన్నం - 2 కప్పులు (వేడిగా ఉండాలి)
ఉల్లిపాయ - 1 (తరిగినది)
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
ఇంగువ - 1/4 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - (తరిగినది)
తయారీ విధానం:
ఈ మినప దిబ్బరొట్టెను తయారు చేసుకోవాలనుకునేవారు ముందుగా గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక గిన్నెలో మినప పిండి, వేడి అన్నం, ఉప్పు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
దీనిని మిక్సీ గ్రైండర్‌లో వేసుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో తగినంత నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఒక పాన్ లో నూనె వేడి చేసి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తరువాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
మిశ్రమంలా తయారు చేసుకున్న పిండి మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత దిబ్బరొట్టె తయారు చేసుకోవడానికి ప్రత్యేకమైన పెనాన్ని తీసుకుని బాగా వేడి చేయాలి.
ఇలా వేడి చేసిన తర్వాత అందులో పిండి మిశ్రమాన్ని వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
వేయించిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి.
చిట్కాలు:
మినప దిబ్బరొట్టె మరింత రుచి పొందడానికి పిండి మిశ్రమంలో మసాలా దినుసులను వేసుకోవాల్సి ఉంటుంది.
దిబ్బరొట్టెలను మరింత మెత్తగా చేయడానికి.. మినప పిండిని రాత్రంతా నానబెట్టవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి