Sugar Morning Diet: షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే ప్రధానంగా మన దేశంలో షుగర్, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇది బ్యాడ్ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తుంది. షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అంతేకాదు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొని ఎప్పటికప్పుడు రక్తపు పరీక్ష చేయిస్తూ ఉండాలి. తద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
షుగర్ వచ్చిన తర్వాత వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాస్త నీరసంగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట కొన్ని పనులు అలవాటు చేసుకుంటే తక్షణ శక్తి అందుతుంది. రోజంతటికి కావాల్సినంత శక్తి వీళ్లకు అందుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల అలవాట్లు చేసుకోవాలి.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయానికి చేయాలి, దీని వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా చాలామంది ఉంటారు, ఇది వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఇక షుగర్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి, గ్లైసిమిక్ సూచి కూడా తక్కువగా ఉండేలా చూసుకోండి, అలాంటి ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి.
అంతేకాదు షుగర్ ఉన్నవాళ్లు ప్రధానంగా తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మాత్రమే వాళ్ళ డైట్ లో చేర్చుకోవాలి. ఓట్ మిల్ కూడా డైట్లో చేర్చుకోవచ్చు. అయితే చక్కెర ఉండే పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఇది మాత్రమే కాదు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే గుడ్లు, గింజలు, గ్రీక్ యోగార్ట్ వంటివి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు మీకు రోజంతటికి కావలసిన శక్తి అందుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిల అదుపులో ఉండాలంటే ఎక్కువ మోతాదులో నీళ్లు కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రధానంగా ఎండాకాలంలో షుగర్ లెవెల్ తగ్గుతాయి. ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అయితే వీళ్ళు చక్కర అధికంగా ఉండే డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ప్రధానంగా జ్యూసులు, సోడాలు వంటివి తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి. వీటికి బదులుగా చక్కర లేని టీ లేదా కాఫీ తీసుకోవాలి.
ఇదీ చదవండి: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది లైవ్ వీడియో విడుదల..
వీటితోపాటు ఎప్పటికప్పుడు ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తూ ఉండాలి. రాత్రి తిన్న తర్వాత కూడా వెంటనే ఎక్సర్‌సైజ్, కాస్త నడక అయిన వెళ్లాలి. ఇలా చేయడం వల్ల షుగర్ పెరగకుండా ఉంటాయి. యోగా చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు మందులు తీసుకొని షుగర్ లెవెల్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. దీని ఆధారంగా మీ డైట్ చాట్ మార్చుకోవాలి. తద్వారా మీకు షుగర్ తో ప్రమాదం ఉండదు.
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









