Weightloss Tips: దేశీ నెయ్యితో వేగంగా బరువు తగ్గవచ్చు..అది ఎలాగో తెలుసుకోండి!
Ghee Weight Loss: దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలి అనుకొనేవారు ఈ నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ghee Weight Loss: అధునిక కాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం వాయిట్ లాస్ ప్రొడెక్ట్స్, మందులు, చికిత్సలు తీసుకుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే సహాజంగా వాయిట్ లాస్ కోసం కొన్ని ఆహారపదార్థాలు మనకు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందులో మనం ప్రతిరోజు వంటలలో ఉపయోగించే దేశీ నెయ్యి ఒకటి. ఈ నెయ్యిని వేడి వేడి అన్నంలో పప్పుతో కలుపుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చాలా మంది నెయ్యి అనగానే అందులో అధిక కేలరీలు ఉంటాయని అపోహాపడుతుంటారు. దీని వల్ల నెయ్యిని తీసుకోకుండా ఉంటారు.
కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం దేశీ నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ దీని తీసుకోనే పద్దతిలో తింటే ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సులువుగా బరువు తగ్గవచ్చు. అయితే ఈ దేశీ నెయ్యి కొవ్వును ఎలా కరిగిస్తుంది అనేది తెలుసుకుందాం.
దేశీ నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో నిపుణులు చెబుతున్నారు. రోజూ నెయ్యి తినడం వల్ల శరీరంలోని కొవ్వు ఏర్పడే కణాలు తగ్గిపోతాయి. ఈ విధంగా రోజు ఆహారంలో నెయ్యిని తినడం వల్ల సులువుగా బరువు అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నెయ్యిని తీసుకోవడం వల్ల కొవ్వు అధికంగా పెరుగుతుందని కాబట్టి మితంగా తీసుకోవడం చాలా మంచిది.
ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకొనే నెయ్యిలో లినోలెయిక్, మంచి కొవ్వు పుష్కలంగా దొరుకుతుంది. దీని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనవరసమైన కొవ్వును తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నెయ్యని ఉపయోగించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.
ఆహారంలో నెయ్యి కలుపుకొని తినడం వల్ల కడుపు నిండిన భావనకలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో పోషకాలు, విటమిన్‌లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి శక్తిని అందిస్తుంది. అధిక బరువు ఉన్నవారలో అతిగా ఆకలి కలుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నెయ్యి కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు ఉంటుంది.
మరి ఈ నెయ్యిని ఎలా మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతాము. ఎలా తింటే శరీరానికి పోషకాలు దొరుకుతాయి. ఈ విషయాల ఇక్కడ తెలుసుకోండి
సులువుగా బరువు తగ్గాలి అనుకొనేవారు ఆహారంలో భాగంగా ఈ దేశీ నెయ్యిని ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలుపుకొని తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు వంటలో కూడా ఈ నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. నూనెకు బదులుగా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాఫీ, టీలో కూడా కొందరూ ఈ నెయ్యిని ఉపయోగించి తాగుతారు. అయితే దీని అతిగా కాకుండా కొంచెం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి