Homemade Facewash: సాధారణంగా మనం ప్రతిరోజూ ఫేస్‌ వాష్‌లు ఉపయోగిస్తాం. అయితే, ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా సహజసిద్ధమైన ఫేస్‌ వాష్‌లు ఉంటాయని మీకు తెలుసా? ఇవి మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే వీటిలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవ మనకు సహజసిద్ధమైన కాంతివంతం చేస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనగ పిండి, పసుపు..
శనగపిండిలో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శనగపిండి ముఖంపై ఉన్న డెడ్‌ సెల్స్‌ నిర్మూలిస్తాయి. పసుపులో కూడా ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు ఉంటాయి. ముఖంపై మచ్చలు వాపు సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది కూడా. శనగపిండి, పసుపు రెండిటినీ కలిపి రోజ్‌ వాటర్‌తో ముఖానికి స్క్రబ్‌ చేయడం వల్ల మృదువుగా, కాంతివంతమవుతుంది.


కాఫీ, కొబ్బరినూనె..
ఈ రెండు కూడా చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. కాఫీ కొబ్బరినూనె రెండూ చర్మానికి మేలు చేస్తాయి. కాఫీ బ్లడ్‌ సర్క్యూలేషన్‌ను మెరుగు చేస్తాయి. ముఖంపై ఉండే నల్ల, తెల్లమచ్చలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె మన చర్మానికి మాయిశ్చరైజింగ్‌ గుణాలు అందించి స్కిన్ డ్యామేజ్‌ అవ్వకుండా కాపాడుతుంది. కాఫీ కొబ్బరి నూనె రెండూ కలిపి ముఖాన్ని సర్క్యూలర్‌ మోషన్లో మసాజ్‌ చేయాలి.


తేనె, చక్కెర..
కాస్త బరకగా పట్టిన చక్కెర, తేనె రెండిటినీ కలిపి ముఖంపై స్క్రబ్‌ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మానికి సాగే గుణం కలిగి ఉంటుంది. ఒక స్పూన్‌ బరకగా చేసిన బ్రౌన్‌ షుగర్‌,  తేనె కలిపి ముఖంపై స్క్రబ్‌ చేసుకోవాలి. ముఖంపై ఈ పేస్ట్‌ను మృదువుగా స్క్రబ్‌ చేయాలి.


ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..


ఓట్స్‌, పాలు..
ఓట్స్‌లో ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాదు ముఖంపై నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది. రక్తసరఫరాను మెరుగుచేస్తుంది. దీంతో ముఖం కాంతివంతమవుతుంది. ఓట్స్‌, పాలను రెండిటనీ కలిపి మెత్తటి స్క్రబ్‌ మాదిరి తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ ముఖంపై ఉండే పిగ్మంటేషన్‌ తగ్గిస్తుంది.


ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?


ఆరేంజ్‌ తొక్క పొడి..
ఆరేంజ్‌ తొక్కలో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు ఉంటాయి. ఇది యాక్నేను నివారిస్తుంది, డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా ఎక్కువ సమయంపాటు ఉంచుతుంది. ఆరేంజ్‌ తొక్క పొడి ఒక స్పూన్‌ ఆర్గానిక్‌ రోజ్‌ వాటర్‌ను కూడా యాడ్‌ చేయాలి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter