Neem And Curry Leaves For Long Hair: జుట్టు పెరుగుదలకు కొంతమంది కొన్ని వేల రూపాయలు ఖర్చుపెట్టి మరి ప్రయత్నిస్తారు. అయితే అందులో కెమికల్స్ ఎక్కువ ఉండటంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి. ముఖ్యంగా మన బామ్మల కాలంనాటి ఈ ఆకులు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఈ చెట్టు ఆకులు మీ జుట్టును గుబురుగా నడుము వరకు పెరిగేలా చేస్తుంది. దీంతో మీ జుట్టు రాలకుండా డాండ్రఫ్ లేకుండానే పెరిగిపోతుంది.
కరివేపాకు, వేపాకు రెండు కలిపి ప్యాక్ మాదిరి జుట్టుకు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మందంగా పెరుగుతూనే ఉంటుంది. లాగినా జుట్టు ఊడదు. అయితే దీనికి తగిన డైట్ కూడా అనుసరించాలి. ముందుగా వేపాకు కరివేపాకు హెయిర్ కేర్ రొటీన్ లో అనేక లాభాలు ఉంటాయని గుర్తించుకోండి. ముఖ్యంగా వేపలో యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఇక కరివేపాకు కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. యాంటీ డాండ్రఫ్ లక్షణాలు కరివేపాకుల కూడా కలిగి ఉంటాయి. ఇక వేపాకు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉండటం వల్ల చుండ్రు రాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. కరివేపాకులో ముఖ్యంగా డాండ్రఫ్ ను వదిలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కరివేపాకులో బీటా కెరోటీన్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. జుట్టు ఊడిపోయి సన్నగా మారిన వాడు కరివేపాకు ఉపయోగించాలి. అంతేకాదు డైట్ లో కూడా చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు నేరుగా తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ఆర్‌జే మహవాష్ ఎవరు? ఛాపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఛాహల్‌తో కనిపించిన మిస్టరీ గర్ల్..
కరివేపాకులో సహజసిద్ధమైన మాయిశ్చర్ గుణాలు కలిగి ఉంటాయి. జుట్టు పొడిబారకుండా కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేప ఆకులో క్లెన్సింగ్ ఏజెంట్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని ఉపయోగించినా కానీ మాయిశ్చర్ గుణాలు కలిగి ఉంటుంది. చుండ్రు మన దరిచేరకుండా ఉంటుంది.
కుదుళ్ల ఆరోగ్యానికి వేపాకులు ఉపయోగించాలి. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి. కరివేపాకు జుట్టు బలంగా మారుస్తుంది. ఫోలికల్స్ డ్యామేజ్ కాకుండా యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇది బలంగా మారడానికి తోడ్పడుతుంది పోషణ అందిస్తుంది.
ఇదీ చదవండి: మృత్యుంజయుడురా మావ.. రైలు ఢీకొట్టినా లేచి నడిచివెళ్లాడు, షాకింగ్ సీసీటీవీ ఫూటేజ్
అంతేకాదు కరివేపాకు తరచూ ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు చక్కని పరిష్కారం. త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. నల్లగా నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది. కరివేపాకులో క్లెన్సింగ్ ఏజెంట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు కుదుళ్లకు తోడ్పడుతుంది. మంచి పోషణ అందించి జుట్టును బలంగా మారుస్తుంది. జుట్టు బలంగా ఒత్తుగా పెరగాలంటే ఈ రెండు ఆకులను కలిపి మాస్క్ మాదిరి వేసుకోవాలి. తలస్నానం చేసే ముందు ఇలా చేయడం వల్ల మంచి పోషణ లభిస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









