Neem Leaves: వేప ఇలా వాడితే చుండ్రుకు చెక్‌.. ముఖంపై యాక్నేకు టాటా చెప్పండి..

Neem Leaves Beauty benefits: వేపను అజరికాయ ఇండికా అనే సైంటిఫిక్ పేరు కూడా ఉంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం పరంగా కూడా కొన్ని వందల ఏళ్లుగా ఔషధపరంగా ఉపయోగిస్తున్నారు. అయితే చర్మం, జుట్టుకు వేప ఆకు రాయటం వల్ల  అనేక ప్రయోజనాలు ఉంటాయి..

Written by - Renuka Godugu | Last Updated : Mar 1, 2025, 05:02 PM IST
Neem Leaves: వేప ఇలా వాడితే చుండ్రుకు చెక్‌.. ముఖంపై యాక్నేకు టాటా చెప్పండి..

Neem Leaves Beauty benefits: వేపతో నూనె, పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మంచి డిటాక్స్  గుణాలు కూడా కలిగి ఉంటుంది. వేపాకు చర్మానికి యాక్నే తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు జుట్టుపై ఉండే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. వేప మన ముఖంపై ఉన్న అదనపు నూనెను కూడా గ్రహించేస్తుంది. యాక్నేకు వ్యతిరేకంగా పోరాడి చర్మం, దురదలను తగ్గించేస్తుంది. ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

Add Zee News as a Preferred Source

వేప జుట్టుకు రాయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. వేపతో ముఖానికి మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఇది మంచి టోనింగ్ ఏజెంట్ లాగా కూడా పని చేస్తుంది. వేప నూనె వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది. మన బ్యూటీ రొటీన్ లో వేపది ప్రత్యేక స్థానం. ఇది పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పాలి.. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. వేపతో తయారు చేసుకునే ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం.

వేపతో ఈ ప్యాక్ తయారు చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే యాక్నే తగ్గిపోతుంది. వేప ఆకులను మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేసుకుని, అందులో కొద్దిగా రోజు వాటర్, పసుపు వేసుకొని ముఖమంతా అప్లై చేసి ఓ అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల యాక్నే తొలగిపోతుంది. ఇక వేపతో తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలిపి ముఖానికి ప్యాక్ వేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది. ఇక వేప ఆకులను ఉడికించి మంచి టోనర్ గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ముఖానికి స్ప్రే చేయడం వల్ల అదనపు నూనెను గ్రహించేస్తుంది. వేప, అలోవెరా పేస్టు తయారుచేసి జుట్టు అంతా రాయడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది.

విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. మార్చి 13, 14, 15, 16 వరుసగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఎందుకు తెలుసా?  

వేప ఆకులను చిన్న ముక్కలుగా కట్‌ చేసి కొబ్బరి నూనెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నూనెను జుట్టు అంతటికీ అప్లై చేయాలి.. ఇలా చేయడం వల్ల కూడా జుట్టుపై ఉండే చుండ్రు తగ్గిపోతుంది. ఇక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఆముదం నూనెతో పెరుగు ఈ వేప పొడి వేసి బాగా కలిపి జుట్టు అంతటికి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి.. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఇది మాత్రమే కాదు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కుదుళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాదు చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.. ఈ నీటిని షాంపూలో కూడా వేసి తలస్నానం చేయవచ్చు. వేపా, మందార ఆకు, పెరుగులో వేసి పేస్టు మాదిరి తయారు చేసుకుని జుట్టు అంతటికి పట్టించాలి. ఓ అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా.. మందంగా వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది.

ఇదీ చదవండి: దానిమ్మ పండు కంటే ఆకులోనే అసలు ఆరోగ్యం.. పోషకాలు పుష్కలం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News