Neem leaves: ప్రతిరోజు వేపాకు నమిలితే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Neem Leaves Health Benefits: వేపాకు తినాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఛేదుగా ఉంటుంది. అయితే ఇందులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు రెండు వేపాకుల నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 26, 2025, 12:17 PM IST
Neem leaves: ప్రతిరోజు వేపాకు నమిలితే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

 Neem Leaves Health Benefits: వేపాకులో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఔషధాల్లో వీటిని వినియోగిస్తున్నారు. వేపాకు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. 

Add Zee News as a Preferred Source

 ప్రధానంగా రెగ్యులర్‌గా వేపాకు తినడం వల్ల మీ కాలేయం డీటాక్స్ఫికేషన్ అయిపోతుంది. దీంతో మీ కాలేయంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాదు మీ చర్మం కూడా మెరుస్తూ కనిపిస్తుంది. తక్షణ శక్తి కూడా అందించే గుణం వేపాకులో ఉంటుంది. 

ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు వేపాకు సహజంగా దోమలను తరిమే గుణం కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాలను కూడా మన నుంచి దూరంగా ఉంచుతుంది. వేపాకులను ఎండబెట్టి కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న దోమలు అన్ని బయటకు పారిపోతాయి. 

 ప్రధానంగా ఎండాకాలంలో కొన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో వేపాకు మంచి కూలింగ్ గుణాలు కలిగి ఉంటుంది. మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంతేకాదు ఈ వేపాకు చర్మానికి రాయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వేపాకు డైట్ లో చేర్చుకుంటే ఇది సహజంగా మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది . అందులో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఖాళీ కడుపున రెండు వేపాకు నమలడం చేసుకోవడం వల్ల మీ రక్తం కూడా క్లెన్స్ అయిపోతుంది. 

 వేపాకు వల్ల మీ చర్మ సమస్యలు దూరం అవుతాయి. వీటిని పేస్ట్‌ చేసి దురద ఉన్న ప్రాంతంలో రుద్దడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వేపాకు నీటిలో వేసి ఉడికించి స్నానం చేయాలి.

 ఇది మాత్రమే కాదు జీర్ణ ఆరోగ్యానికి వేపాకు తోడ్పడుతుంది. ఇందులో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడే గుణం ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్, అజీర్తి తగ్గిపోతుంది.  డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు వేపాకు తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతులను చేస్తుంది. డయాబెటిస్ వారికి ఇది మంచిది. ప్రతిరోజు ఉదయం తీసుకోవటం వల్ల ఇన్సులిన్ స్థాయిలను కూడా నిర్వహిస్తుంది.

ఇదీ చదవండి:  పాకిస్తాన్‌ డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం.. గొంతు కోస్తా అంటూ భారతీయులకు పాక్‌ అధికారి వార్నింగ్‌..

 అంతే కాదు నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు కూడా వేపాకులను తీసుకోవాలి. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. చిగుళ్ల ఆరోగ్యానికి కూడా వేపాకు ఉపయోగిస్తారు. అందుకే వివిధ రకాల టూత్ పేస్టులో కూడా వేపాకు ఉంటుంది. ప్రధానంగా ఎండాకాలంలో ఎక్కువ వేడి ఉంటుంది తక్షణంగా మనం శరీరాన్ని చల్లదనం పరిచే గుణాలు ఉంటాయి. దీంతో మనకు అతిగా చెమట రాదు, నీరసానికి గురి కాకుండా ఉంటారు.

ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News