Weight Loss Diet: మీ పెళ్లి కోసం బరువు తగ్గాలనుకుంటున్నారా..? 30 రోజులు ఇలా చేస్తే మ్యాజిక్ రిజల్ట్స్ చూస్తారు..!

Weight Loss Diet: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పెద్ద విషయం. తమ వెడ్డింగ్ డే రోజున చాలా మంది మహిళలు.. అందంగా కనిపించాలని అనుకుంటారు. అలా కనిపించాలనుకుంటున్న వారి కోసం కేవలం 30 రోజుల్లో బరువు తగ్గడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Aruna Maharaju | Last Updated : Nov 7, 2025, 05:58 PM IST
Weight Loss Diet: మీ పెళ్లి కోసం బరువు తగ్గాలనుకుంటున్నారా..? 30 రోజులు ఇలా చేస్తే మ్యాజిక్ రిజల్ట్స్ చూస్తారు..!

30 Days Weight Loss Tips Indian Brides: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పెద్ద విషయం. తమ వెడ్డింగ్ డే రోజున చాలా మంది మహిళలు.. అందంగా కనిపించాలని అనుకుంటారు. అలా కనిపించాలనుకుంటున్న వారి కోసం కేవలం 30 రోజుల్లో బరువు తగ్గడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 30 రోజుల్లో కనీసం 4-5 కిలోల బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా మీరు ఈ డైట్ పాటిస్తే మీకు గ్లోయింగ్ స్కిన్, హెల్తీ హెయిర్ కూడా వస్తుంది. 

Add Zee News as a Preferred Source

నెల రోజుల్లో బరువు తగ్గడానికి సింపుల్ డైట్ ప్లాన్.. 
1. ఉదయం 6.30-7.00 గంటల మధ్య నిద్ర లేవాలి.
2. ప్రతిరోజూ 500 మి.లీ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం లేదా జీలకర్ర వాటర్ చేసుకొని తాగాలి.
3. క్రమం తప్పకుండా 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
4. ఖచ్చితంగా 7-8 గంటలు నిద్రపోవాలి.
5. ఈ నెలరోజులు షుగర్, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. నూనె, అన్నం కొంచెం మితంగానే తీసుకోవాలి.
6. అలాగే రోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. గ్రీన్ టీ,  కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు.

బ్రేక్‌ఫాస్ట్‌కి ఉదయం 8.00-9.00 గంటల మధ్య ఏం తినాలంటే.. 
1. ఉడికించిన కూరగాయలు + ఒక గుడ్డు/పనీర్ తీసుకోవచ్చు.
2. 1 అరటిపండు + 1 బ్లాక్ కాఫీ 
సోమవారం: 2 ఇడ్లీలు + సాంబార్ + పుదీనా చట్నీ
మంగళవారం:  వెజిటేబుల్ సూప్ / రవ్వ కిచిడి + ఏదైనా ఒక పండు
బుధవారం: 1 దోసె + చట్నీ + గుడ్డు
గురువారం:  ఓట్స్ + పాలు + సగం ఆపిల్
శుక్రవారం: ఉప్మా/రాగి జావ
శనివారం: రాగి దోస + పెరుగు
ఆదివారం: 1 చపాతీ + ఏదైనా ఫ్రూట్

మధ్యాహ్న భోజనం (సమయం 12.30-1.30)..
సోమవారం: బ్రౌన్ రైస్ + సాంబార్ + పెరుగు
మంగళవారం: 2 చపాతీలు + చికెన్ / పనీర్ కర్రీ + వెజిటేబుల్ సలాడ్
బుధవారం: క్వినోవా + రసం + సలాడ్
గురువారం: మిల్లెట్ రైస్ + గుడ్డు/వెజిటేబుల్స్
శుక్రవారం: వెజ్ పులావ్ + దోసకాయ సలాడ్
శనివారం: 2 గోధుమ రొట్టెలు + పప్పు + వెజిటేబుల్ సలాడ్
ఆదివారం: చేపల కూర + బ్రౌన్ రైస్ + సలాడ్

సాయంత్రం స్నాక్స్: 4.30-5.30..
గ్రీన్ టీ / బ్లాక్ కాఫీ + వాల్‌నట్స్ / బాదం, బొప్పాయి, జామ, ఆపిల్, దానిమ్మ, నారింజ (ఏదైనా), వేయించిన పల్లీలు.

రాత్రి భోజనం: 7.00–8.00 గంటల మధ్య..
సోమవారం: వెజ్ సూప్ + 1 టోస్ట్ చేసిన బ్రౌన్ బ్రెడ్
మంగళవారం: గ్రిల్డ్ చికెన్/టోఫు + వేబిటేబుల్స్
బుధవారం:  కర్డ్ రైస్
గురువారం: మూంగ్ దాల్ దోస + పుదీనా చట్నీ 
శుక్రవారం: ఓట్ మీల్ + గుడ్డు
శనివారం: రసం రైస్ + సలాడ్
ఆదివారం: చపాతీ + చికెన్/పాలకూర

గ్లోయింగ్ స్కిన్ టిప్స్..  
1. సోమవారం మరియు గురువారం: పాలకూర స్మూతీ తాగండి.
2. బుధవారం: బీట్‌రూట్ రసం 
3. శనివారం: కొబ్బరి నీళ్లు
4.ఆదివారం: తులసి/హెర్బల్ టీ

Also Read: Pumpkin Juice: గుండె నుండి లివర్ వరకు చలికాలంలో గుమ్మడికాయ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు ఇవే..!

Also Read: Magic Drink: కంటి చూపును మెరుగుపరిచే పవర్‌ఫుల్ జ్యూస్.. తాగితే మ్యాజిక్కే.. పక్కా ట్రై చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News