)
Oranges Benefits: ఆరెంజ్ ఇది సీట్రస్ జాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆరెంజ్‌లో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ కూడా కలిగి ఉంటుంది. మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ కట్..
ఆరెంజ్‌లో విటమిన్ సీ కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇది ఒక హార్ట్ హెల్తి ఫుడ్ అని చెప్పవచ్చు.
ఇమ్యూనిటీ బూస్ట్..
ఆరెంజ్ లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసే గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇమ్యూనిటీ సెల్స్ పనితీరు కూడా మెరుగు చేస్తుంది. రెగ్యులర్‌గా ఆరెంజ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది.
ఎనీమియా.
ఆరెంజ్ ఎనీమియా సమస్య రాకుండా కాపాడుతుంది. ఇది ఐరన్ గ్రహించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది. ఐరన్ లేమితో బాధపడుతున్న వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది త్వరగా ఐరన్ గ్రహించేలా తోడ్పడుతుంది.
కొన్ని ప్రాణాంతక వ్యాధులు కూడా దరిచేరకుండా ఇది కాపాడుతుంది. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్ళు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలకు కూడా దూరంగా ఉంచుతుంది. సీట్రస్ ఫ్రూట్ కాబట్టి రెగ్యులర్‌గా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ ప్రమాదాలు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఆరెంజ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీకి అధిక భారం అవ్వవచ్చు. ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ఫుడ్ మితంగా తీసుకోవాలి. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ కి కూడా దారితీసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook