White Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారే ఉపాయం..జుట్టు రాలే సమస్యకి పెట్టండి పుల్‌స్టాప్!

Onion Hair Oil Benefits: మనలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మన వంట ఇంట్లో దొరికే ఓ పదార్థంతో ఈ సమస్యకు టాటా చెప్పొచ్చు. ఇంతకీ తెల్లజుట్టును నల్లగా మార్చే ఆ ఔషధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Harish Darla | Last Updated : Nov 15, 2025, 02:27 PM IST
White Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారే ఉపాయం..జుట్టు రాలే సమస్యకి పెట్టండి పుల్‌స్టాప్!

Onion Hair Oil Benefits: మారుతున్న వాతావరణం, జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మన వంట ఇంట్లో దొరికే ఓ పదార్థంతో ఈ సమస్యకు టాటా చెప్పొచ్చు. ఇంతకీ తెల్లజుట్టును నల్లగా మార్చే ఆ ఔషధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

వంటింట్లో దొరికే ఉల్లిపాయ తొక్కలతో కొబ్బరినూనెను కలిపి ఈ అద్భుతమైన నూనెను తయారు చేయాలి. ఇది జుట్టు రాలే సమస్యతో పాటు తెల్ల జుట్టును నివారిస్తుంది. ఈ నూనెను తయారు చేసేందుకు ఒక గిన్లోనె ఉల్లిపాయ తొక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మెంతులతో పాటు కొబ్బరి నూనె తీసుకోవాలి.

Also Read: IPL Retention 2026: ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది..రిటెన్షన్ లిస్ట్ విడుదలకు సిద్ధం..ఎక్కడ లైవ్‌లో చూడాలి?

ఆ తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టి 4 చెంచాల మెంతులు, ఉల్లిపాయ తొక్క, తరిగిన ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించాలి. అవి నల్లగా మారిన తర్వాత.. కొబ్బరి నూనె వేసి బాగా మరిగేలా చేయాలి. చల్లబడిన తర్వాత ఓ సీసాలో భద్రపరచాలి. 

అలా తయారు చేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు మేలు చేస్తుంది. దీన్ని వారానికి రెండు సార్లు వాడితే తలలో స్వేద రంధ్రాలు తెరచుకుంటాయి. ఉల్లిపాయ తొక్క కొల్లాజెన్‌ను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.  

మెంతి గింజల్లో విటమిన్-ఈ జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది. కుదుళ్ల నుంచి జుట్టు బలంగా మారుతంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉల్లిపాయతో చేసిన నూనె చుండ్రు సమస్యకు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు తలపై ఉన్న చర్మాన్ని శుభ్రపరడంతో పాటు చుండ్రు సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. 

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సంగ్రహించినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

ALso Read: Bihar Election Result 2025: అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్..ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ..ప్రశాంత్‌ కిషోర్‌ను దెబ్బకొట్టిన జనాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News