Orange Fruit Benefits: ఆరెంజ్ నోటికి పులుపు, తిపి రుచిని అందించిన శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్‌తో పాటు సిట్రిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారానికి ముందు తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. అనేక రకాల వ్యాధుల తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా రోజు ఆరెంజ్ ఆల్పాహారంలో తీసుకుంటే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆరెంజ్ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యం:
ఆరెంజ్ పండ్లలోని పొటాషియంతో పాటు అనేక రకాల పోషకాలు ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఉదయాన్నే తింటే రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యం:
ఆరెంజ్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఇప్పటికే ముఖంపై తీవ్ర మచ్చలు, మొటిమల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరెంజ్ రసాన్ని అల్పాహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
కంటి ఆరోగ్యం:
ఆరెంజ్ పండ్లలోని విటమిన్ ఎ కూడా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల కంటి సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇప్పటికే కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను రోజు తినాల్సి ఉంటుంది.
బరువు తగ్గడం:
ఆరెంజ్ పండ్లలో కేలరీలు తక్కువగా మోతాదులో లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజు ఈ పండ్ల నుంచి తీసిన రసాలను తాగాల్సి ఉంటుంది.
జీర్ణక్రియ:
ఆరెంజ్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండడమే కాకుండా ఇతర మూలకాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మలబద్ధకం సమస్యను కూడా ఎంతో సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









