Palak Dosa Recipe: అన్ని దోశల్లోకెళ్ల ఆరోగ్యమైన దశ.. పాలకూర దోశ రెసిపీ..

Palak Dosa Recipe: అల్పాహారంలో భాగంగా పాలకూర దోశ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్స్‌ అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 1, 2024, 01:38 PM IST
Palak Dosa Recipe: అన్ని దోశల్లోకెళ్ల ఆరోగ్యమైన దశ.. పాలకూర దోశ రెసిపీ..

Palak Dosa Recipe: దోశ అంటే అందరూ ఎంతగానో ఇష్టపడతారు. చాలా మంది దీనిని వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీ దోశతో పాటు, ఉల్లి దోశ, మసాల దోశను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ దోశ మరి కొన్ని ప్రాంతాల్లో పాలకూరతో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్లు A, C వంటి పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ కూడా లభిస్తుంది. ఇది శరీర బరువు, రక్తపోటును అదుపులో ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందికి ఈ పాలకూరతో దోశ ఎలా వేసుకోవాలో తెలియదు. ఈ దోశలను అన్నింటి కంటే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పాలకూర దోశను ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పాలకూర దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:
4 కప్పుల దోశ పిండి
2 కప్పులు పాలకూర
2 పచ్చి మిరపకాయలు
చిన్న అల్లం ముక్క
1/4 టీస్పూన్ పసుపు పొడి
4 టేబుల్ స్పూన్లు నెయ్యి లేదా నూనె
ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెను స్టౌవ్‌పై పెట్టుకుని నాలుగు కప్పుల నీరు వేడి చేసి, అందులో పసుపు పొడి వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది.
నీరు మరగుతున్న క్రమంలో శుభ్రంగా కడిగిన పాలకూర, పచ్చి మిరపకాయలు, అల్లం వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత ఇలా ఉడికించిన పాలకూరను అందులో నుంచి నీటిని ఫిల్టర్ చేసి పాలకూరను చల్లారనివ్వాలి.
ఉడికించిన పాలకూర, పచ్చి మిరపకాయలు, అల్లంను మెత్తని పేస్టులాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పేస్టును దోశ బ్యాటర్‌లో వేసి బాగా కలపాలి.
పిండిని బాగా కలిపిన తర్వాత తవాను వేడి చేసి, 1/2 టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేసి, దోశను వేసుకొవాల్సి ఉంటుంది.
దోశలు లేత గోధుమ రంగు వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి.
అంతే పాలక్ దోశ రెడీ! మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చిట్కాలు:
దోశ బ్యాటర్ చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకూడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
దోశను తవాపై పోసేటప్పుడు, తవా వేడిగా ఉంటే వల్ల దోశలు బాగా వస్తాయి.
దోశను ఎక్కువసేపు రోస్ట్ చేయకుండా ఉండండి లేకపోతే అది గట్టిగా అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.
పాలకూరకు బదులుగా, మీకు ఇష్టమైన ఇతర ఆకుకూరలను కూడా ఉపయోగించవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News