Palak Juice Benefits In Telugu: పాలకూర రసంలో శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ A, C, Kతో పాటు ఐరన్, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజు ఆహారాల్లో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పాలకూర రసం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవే కాకుండా శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలకూర రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పాలకూరలో విటమిన్ Cతో పాటు ఇతర విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజు ఈ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కంటి ఆరోగ్యానికి మేలు:
పాలకూర రసంలో విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కంటి సంబంధిత సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా కంటికి ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
పాలకూర రసంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
శరీర బరువును తగ్గిస్తుంది:
పాలకూరలో క్యాలరీలు తక్కువగా పరిమాణంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది శరీర బరువు తగ్గడానికి.. కొవ్వును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా పాలకూర రసం తాగాల్సి ఉంటుంది.
రక్తహీనత సమస్య:
పాలకూర రసంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రక్తహీనతను నివారించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో ఐరన్ లోపం సమస్యలు ఉంటే తప్పకుండా ఆహారాల్లో తప్పకుండా పాలకూర రసం తీసుకోవాల్సి ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలు:
పాలకూర రసంలో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది జీర్ణక్రియ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సులభంగా మలబద్ధకాన్ని నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఇప్పటికే మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
చర్మం, జుట్టు సమస్యలు:
పాలకూరలో ఉండే విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చర్మంపై మచ్చలు తగ్గిస్తుంది. తరుచుగా జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









