Paeer Health Benefit: పనీర్‌ను పాలతో తయారుచేస్తారు. ఇందులో కాల్షియం ఉంటుంది. కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు పనీర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. నాన్ వెజ్ తినలేని వారు పనీర్ డైట్ లో చేర్చుకోవాలి. పాలలో నిమ్మరసం పిండి పనీర్ తయారు చేస్తారు. అయితే చీజ్ మాదిరి ఇది వేడి చేస్తే కరిగిపోదు. దీన్ని ఫ్రై చేసుకుని వండుకొని తినవచ్చు. పనీర్‌తో పాలక్ పనీర్, మటర్ పనీర్, పనీర్ టిక్కా మసాలా వంటివి తయారు చేసుకుంటారు.
అధిక ప్రోటీన్…
పనీర్‌లో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన శరీరాన్ని పనితీరుకు ఎంతో అవసరం. కొన్ని నివేదికల ప్రకారం పనీర్ ఒక సూపర్ ఫుడ్. ఆరోగ్యకరమైన కండరాలకు ఎంతో అవసరం.. పనీర్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అతిగా తినకుండా ఉంటారు.
రెగ్యులర్‌గా పనీర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో కాల్షియం, విటమిన్ మన శరీరానికి అందుతుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంగా బలంగా మారుతాయి. ఇమ్యూనిటీ పెంచుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా నివారిస్తుంది. దీనివల్ల పళ్ళు కూడా బలంగా ఉంటాయి. విటమిన్ డి ఉండటం వల్ల ఇది క్యాల్షియం బూస్టింగ్ ఇస్తుంది. ఎముక ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు పనీర్ తీసుకోవాలి. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. దీంతో అనారోగ్యకరమైన ఆహారాలు తినకుండా ఉంటారు. పనీర్ డైట్ లో చేర్చుకుంటే ఒక సమతుల ఆహారం అవుతుంది . వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి పనీర్ శక్తి అందిస్తుంది.
రక్తంలో చక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది పనీర్. ఇందులో ట్రిప్టోఫ్యాన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు పనీర్ తీసుకోవచ్చు. అంతేకాదు ఇది సేరోటినైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. తద్వారా డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ అవుతుంది .
ఇదీ చదవండి: Zinc: ఈ విటమిన్ ఉండే ఫుడ్ తింటే జుట్టు ఏ షాంపూ పెట్టకున్నా పెరుగుతూనే ఉంటుంది..
పనీర్ తీసుకోవడం గుండెకు కూడా ఆరోగ్యకరం. కొన్ని నివేదికల ప్రకారం పనీర్‌లో మోనో అన్యాచురేటెడ్, పాలీఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో కార్డీయో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పనీర్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బలంగా మారుతుంది. ఇందులో జింక్ కూడా ఉంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పనీర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇది శరీరారోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో సెలీనియం కూడా ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: ఎండ వేళ కూల్‌వార్త.. శని, ఆది, సోమవారాలు 3 రోజులు వర్షాలు, వడగళ్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









