Papaya Benefits: బొప్పాయి పండు పరిగడుపున తింటే ఏం జరుగుతుంది?

Papaya Fruit Benefits In Telugu: బొప్పాయి పండు పరిగడుపున తినడం వల్ల శరీరానికి అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లభించే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 07:15 PM IST
Papaya Benefits: బొప్పాయి పండు పరిగడుపున తింటే ఏం జరుగుతుంది?

Papaya Fruit Benefits In Telugu: బొప్పాయి పండులో శరీరానికి కావాల్సి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కెతో పాటు విటమిన్ బి9 అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బొప్పాయి పండును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిను పెరుగుతుంది. అలాగే ఇందులో బీటా-కెరోటిన్ ఇది కంటి చూపును మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ బొప్పాయి పండులో విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6 కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో పొటాషియం కూడా ఉంటుంది. పరిగడుపున తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

Add Zee News as a Preferred Source

పరిగడుపున బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలు:
1. జీర్ణక్రియ సమస్యలకు చెక్: 

బొప్పాయిలో పాపైన్ (Papain) అనే ఎంజైమ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల ఈ ఎంజైమ్ నేరుగా జీర్ణవ్యవస్థలోకి చేరి, ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది గ్యాస్, ఉబ్బరంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా పరగడుపున బొప్పాయిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.

2. రోగనిరోధక శక్తి: 
పరిగడుపున బొప్పాయి పండును తినడం వల్ల శరీరానికి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పరగడుపున బొప్పాయిని తినడం వల్ల శరీరం విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. అంతేకాకుండా ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే ఇది తినడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

3. చర్మ సమస్యలు: 
బొప్పాయిలో విటమిన్ ఎతో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలు నేరుగా రక్తప్రవాహంలో కలిసి చర్మానికి పోషణను అందుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చర్మం కూడా తేమగా తయారవుతుంది. అలాగే మొటిమలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

4. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 
బొప్పాయిలో కేలరీలు తక్కువగా మోతాదులో లభిస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పరగడుపున బొప్పాయిని తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో పాటు ఇది అతిగా ఆహారం తినడాన్ని నివారిస్తుంది. దీంతో పాటు ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియను శక్తివంతంగా చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారు.

5. కంటి ఆరోగ్యానికి మంచిది: 
బొప్పాయిలో లుటీన్‌తో పాటు జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి కళ్ల సమస్యలను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న కంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కంటి చూపు కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News