Peanut Benefits: వేరుశెనగను చాలా మంది ఎంతో ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండమే కాకుండా మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధిక పరిమాణంలో అందుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పుష్కలంగా కార్బోహైడ్రేట్లుతో పాటు ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను శక్తివంతంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంత పాటు మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వేరుశెనగలో విటమిన్ E, విటమిన్ B3, విటమిన్ B1, విటమిన్ B2 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నియత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి.
వేరుశెనగ తినడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యం:
వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్‌తో పాటు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
మధుమేహం:
వేరుశెనగ మధుమేహం ఉన్నవారు కూడా రోజు తినొచ్చు. ఇలా తింటే శరీరానికి తక్కువ గ్లైసెమిక్ సూచిక లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
బరువు తగ్గడానికి:
వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి పొట్టను నిండుగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ఆహారం తీసుకోవడం తగ్గి బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు సలాడ్‌లో వీటిని తినడం మంచిది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
వేరుశెనగలో పాలీఫెనోలిక్ యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి. దీని వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఎముకలను దృఢంగా చేసేందుకు:
వేరుశెనగలో కాల్షియంతో పాటు ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు, బోలు ఎముకల వ్యాధిని నివారించేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా దూరమవుతాయి.
రోగనిరోధక శక్తి:
వేరుశెనగలో విటమిన్ Eతో పాటు జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ఇతర సీజనల్ వ్యాధులు కూడా దూరమవుతాయి.
మెదడు సమస్యలు:
వేరుశెనగలో విటమిన్ B3 (నియాసిన్) అధిక మోతాదులో లభిస్తుంది. ఇది మెదడు పనితీరుతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్లమ మెదడు సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









