Pomegranate: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..

Pomegranate Health Benefits: దానిమ్మ పండు ఎరుపు రంగులో ఉండే ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఇది చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించేస్తుంది. తద్వారా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 23, 2025, 09:53 AM IST
Pomegranate: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..

Pomegranate Health Benefits: దానిమ్మ రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని కూడా పునరుజ్జీవనం అందిస్తాయి. ముడతలను తగ్గించడానికి కూడా ఇది సమర్థవంతమైన రెమెడీ. ఎండ వల్ల వచ్చే సన్‌ ట్యాన్‌ కూడా తగ్గించేస్తుంది. తద్వారా మీ ముఖం పై పిగ్మెంటేషన్ మొటిమలు కూడా వెళ్లిపోతాయి.

Add Zee News as a Preferred Source

 సాధారణంగా దానిమ్మ రసం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుందని తీసుకుంటారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన ఆరోగ్య స్థాయిలను పెంచడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే గుణం ఇందులో ఉంటుంది. అంతే కాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారు కూడా దానిమ్మ ఎంతో మంచిది. వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఇందులో ఉంటుంది. ఇది పిల్లలు పెద్దలకు అందరికీ మేలు చేస్తుంది.

మన శరీరానికి నిత్యం బలం కావాలంటే కచ్చితంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సిందే. ప్రతిరోజు మనం దానిమ్మ తీసుకోవడం వల్ల గుండె నుండి మెదడు వరకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఒక వరమని భావించవచ్చు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. తద్వారా గుండె సమస్యలు కూడా మీ దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దానిమ్మ రుచికరంగా ఉండటంతో పాటు మన శరీరానికి సమృద్ధి శక్తి అందిస్తుంది. ప్రధానంగా గుండె ఆరోగ్యాన్ని పెంచుతూ రక్త సంకోచాన్ని తగ్గించి ప్రవాహాన్ని పెంచే గుణం వీటిలో ఉంటుంది. రక్తనాళాలకు మంచి ఆక్సిజన్ అందిస్తుంది. దానిమ్మ మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్ ఉంటాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

దీర్ఘాకాలిక మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా చేస్తుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను వేగవంతం కూడా చేస్తుంది. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించే గుణం ఇందులో ఉంది. 

రెగ్యులర్‌గా దానిమ్మ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. ఈ బిజీ లైఫ్ స్టైల్ లో దానిమ్మ తప్పనిసరి ఆందోళనను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగు చేసే గుణం కూడా ఇందులో ఉంది. అంతేకాదు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

ఇదీ చదవండి:  రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

ఇదీ చదవండి:  ఎండిపోయిన నిమ్మకాయలను పారేయకండి.. ఈ 5 స్మార్ట్ ట్రిక్స్‌తో మళ్లీ వాడొచ్చు ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News