Pomegranate: దానిమ్మ క్యాన్సర్స్‌కు జేజమ్మ.. క్యాన్సర్ నివారణకు అద్భుత ఔషధం

Pomegranate Prevent Cancer: ఆరోగ్యానికి మేలు చేయడంలో పండ్లలో దానిమ్మ పండు ముందుంటుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్లు కూడా దానిమ్మతో తగ్గుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు.. దానిమ్మ పండు ప్రయోజనాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 05:33 AM IST
Pomegranate: దానిమ్మ క్యాన్సర్స్‌కు జేజమ్మ.. క్యాన్సర్ నివారణకు అద్భుత ఔషధం

Pomegranate Fruit Benefits: దానిమ్మపండు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఈ పండు తినడంతో శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండు గురించి మరో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల చేసిన ఓ పరిశోధన ప్రకారం దానిమ్మ తినడం ద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్లు కూడా తగ్గుతాయని ఆ పరిశోధనలో తేలింది. దానిమ్మ పండు తరచూ తీసుకోవడం ద్వారా ఆరు రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుందని ఆ పరిశోధనలో వెల్లడైంది.

Add Zee News as a Preferred Source

Also Read: Okra Water: కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే బెండకాయ నీళ్లు.. కిలోల బరువు ఉఫ్

దానిమ్మ పండుపై పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికా, బంగ్లాదేశ్, కొరియా, నైజీరియా వంటి దేశాలకు చెందిన పరిశోధకులు ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో దానిమ్మ పండుపై ఆసక్తికర విషయాలు తెలిశాయి. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నట్లు ఆ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read: Strawberry: స్ట్రాబెర్రీ ఆరోగ్యంపై డోంట్ వర్రీ.. రోజుకు ఒక్క పండుతో ఏం జరుగుతుందో తెలుసా?

  • ఆహార విధానాలతో సహా జీవనశైలి కారకాలను సవరించడం ద్వారా 45శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులను నివారించవచ్చని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించిన జనవరి 2025 అధ్యయనంలో దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలును వివరించారు.
  • ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చుకోవడం ద్వారా  సంవత్సరానికి కనీసం 20 శాతం క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని పరిశోధనలో పరిశోధకులు తెలిపారు. దీనివల్ల సుమారు 200,000 క్యాన్సర్ సంబంధిత మరణాలను నివారించవచ్చని పరిశోధక బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
  • దానిమ్మ పండులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు వంటి పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధకులు తమ పరిశోధనలో తెలిపారు. దానిమ్మ ప్రోస్టేట్, రొమ్ము, చర్మం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు వంటి వివిధ క్యాన్సర్లను నిరోధించగలదని పరిశోధకులు చెబుతున్నారు.
  • దానిమ్మపండ్లతో మిగతా ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం.. దీర్ఘకాలిక మంటలను తగ్గించడం, కండరాల బరువు కోల్పోవడం వంటివి నివారిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల హార్మోన్ స్థాయిలను సరిచేయడంలో కూడా దానిమ్మపండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News