)
Pregnancy Week Calculator: కొందరు ఆడవాళ్లలో వివాహం తర్వాత కేవలం 30 రోజుల్లోపు గర్భం దాల్చిన విషయం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే నెల రోజుల్లో గర్భం దాల్చడం సాధ్యమేనా? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లైన తర్వాత కొందరు మహిళల శరీరంలో కొన్ని మార్పులు సంభవించవచ్చు. అదే విధంగా కొంతమంది పెళ్లైన నెల రోజుల్లోనే గర్భం దాల్చడం అనేవి జరుగుతూఉంటాయట. మరోవైపు పెళ్లైన చాలా రోజులకు కూడా కొందరు మహిళలు గర్భం దాల్చని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవలే ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లగా తనకు రెండు నెలల గర్భం అని వైద్యులు చెప్పారట.
అయితే ఆ మహిళకు నెల క్రితమే వివాహం అయ్యిందట. పెళ్లైన తర్వాత భర్తతో పడకగదిలో తొలిసారి పంచున్నా.. కేవలం 30 రోజుల్లోనే నెలన్నర గర్భం ఎలా సాధ్యమంటూ ఆమె ఆశ్చర్యపోయింది.
ఆ మహిళకు చేసిన స్కానింగ్ రిజల్ట్ ఆమెను గందరగోళానికి, షాక్‌కు గురి చేశాయి. అందులో ఆమెకు నెలన్నర గర్భం అని తేలింది. అయితే కేవలం 30 రోజుల్లో గర్భం దాల్చడం సాధ్యమేనా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకు డాక్టర్ స్పందిస్తూ.. గర్భదారణ అనేది గర్భం దాల్చిన రోజు నుంచి లెక్కించరని.. మహిళలు తమ చివరి రుతుకాలం నుంచి గర్భదారణకు మొదటి రోజుగా లెక్కిస్తారని స్పష్టం చేశారు.
దీనినే గర్భధారణ వయస్సు అంటారు. అంటే.. గర్భధారణ పరీక్ష మీ చివరి ఋతుస్రావం తర్వాత 4 వారాల తర్వాత మాత్రమే నిర్ధారిస్తుందని డాక్టర్ ఒకరు చెప్పారు. కానీ మీరు మీ చివరి ఋతుస్రావం తర్వాత వారంలోనే గర్భం దాల్చినట్లు అవుతుంది. అయితే.. ఇది 4 వారాల తర్వాత మాత్రమే తెలుస్తుంది.
పిండం వయస్సు 1.5 నెలలు అని చూపిస్తే, ఆ స్త్రీ 1.5 నెలల క్రితం గర్భం దాల్చిందని అర్థం కాదు. అంటే ఆమె ఋతుస్రావం జరిగి దాదాపు ఆరు వారాలు గడిచిందని అర్థం. అంటే ఆ స్త్రీ పెళ్లి రాత్రి లేదా తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకున్న వెంటనే గర్భం దాల్చి ఉండవచ్చు.
దీని ప్రకారం ఆ స్త్రీ వివాహం అయిన నెలన్నర రోజుల్లోపు గర్భం దాల్చే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారిస్తున్నారు. అందువల్ల వివాహం అయిన 30 రోజుల్లోపు మహిళలు గర్భం దాల్చే అవకాశం ఉందని కొందరు వైద్యులు అన్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కొందరు వైద్యుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook