Pumpkin Juice Benefits In Telugu: బూడిద గుమ్మడికాయ రసంలో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ (బి1, బి2, బి3, బి5, బి6) కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల శక్తి ఉత్పత్తిని పెంచి.. నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కాల్షియం కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసంలో పాస్పరస్, మాంగనీస్, జింక్, పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
బూడిద గుమ్మడికాయ రసం ప్రయోజనాలు:
జీర్ణక్రియ సమస్యలు:
బూడిద గుమ్మడి రసం రోజు ఉదయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రసం తప్పకుండా తాగాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి:
బూడిద గుమ్మడికాయ రసంలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చలి, వర్షకాలంలో ఈ రసం తాగడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మానసిక సమస్యలు:
బూడిద గుమ్మడి రసంలో ఉండే శక్తివంతమైన గుణాలు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి:
బూడిద గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉండమే కాకుండా నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీర బరువును నియంత్రించే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
మూత్రపిండాల ఆరోగ్యానికి:
బూడిద గుమ్మడి రసం మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లు నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీని వల్ల కిడ్నీల ఫెయిల్యువర్ సమస్యలు కూడా తగ్గుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









