King Cobra In Bike Video: వామ్మో.. బైక్‌లో దూరిన కింగ్ కోబ్రా.. చివరికి ఏం చేశారో చూస్తే ఆశ్చర్యమే..

King Cobra In Bike Video Watch Here: తాజాగా సోషల్ మీడియాలో బండిలోకి దూరిన పాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2025, 02:36 PM IST
King Cobra In Bike Video: వామ్మో.. బైక్‌లో దూరిన కింగ్ కోబ్రా.. చివరికి ఏం చేశారో చూస్తే ఆశ్చర్యమే..

King Cobra In Bike Video Watch Now: సాధారణంగా పాములు ప్రమాదకరమని అందరికీ తెలుసు? అందుకే వాటిని చూడగానే చాలామంది కేకలు వేసి పరిగెడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాటిని చూసేందుకు కూడా అంతగా ఇష్టపడరు. అయితే గత కొద్ది రోజుల నుంచి అడవుల్లో నీటి సాంద్రత తగ్గి ఆహారం లభించకపోవడం వల్ల పాములు ఇతర జంతువులు పల్లెల్లోకి సంచారం చేస్తూ వస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పెద్ద పెద్ద పాములు సైతం ఇళ్లలో ఊళ్ళలో కనిపిస్తున్నాయి. వీటిని రక్షించేందుకు పాములు పట్టే బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నారు చాలామంది పాములు పట్టేవారు వీటిని రక్షించే క్రమంలో వారు పాముల దాడి బారినపడి కొంతమంది మరణిస్తున్నారు. నిజానికి పాములతో చెలగాటమాడడం చాలా ప్రమాదకరం. కాబట్టి వీటిని ఎంతో జాగ్రత్తగా పట్టుకోవడం చాలా మంచిది. అయితే చాలామంది స్నేక్ క్యాచర్ చేసే కొన్ని పొరపాట్ల వల్ల దానికి గురవుతున్నారు. 

Add Zee News as a Preferred Source

సాధారణంగా గతంలో కంటే ఎప్పుడు లేని రీతిలో అడవి సమీపంలో ఉండే గ్రామాల్లోకి పాములు ఎక్కువగా సంచారం చేస్తున్నాయి. పాములు ఎక్కడపడితే అక్కడ నక్కి జనాలపై దాడి చేస్తున్నాయి. అయితే కంటికి కనబడిన పాములను రక్షించేందుకు చాలామంది స్నేక్  క్యాచర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వారు వీటిని పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ వీడియో తీసి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఓ బైక్‌లో స్నేక్ క్యాచర్ పాములు  బయటికి తీయడం ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. రోడ్డు పైన ఉన్న ఓ బైక్ లోకి కింగ్ కోబ్రా ప్రవేశించింది. అయితే ఆ బైక్ యజమాని బైక్ లో నుంచి వింత శబ్దం వస్తుందని ముందుగానే గమనించి చూడగా అందులో ఆ పాము కనిపించింది దీంతో ఆ యజమాని స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించాడు. ఆ స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని బండిలో నక్కి ఉన్న పామును తన స్నేక్ స్టిక్‌తో బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నించగా రాకపోవడంతో మరోసారి తోక పట్టుకొని లాగుతాడు..

అయితే ఆ పాముకి కోపం వచ్చి బైక్‌‌లో నుంచి కిందికి పాకుతూ వస్తుంది. ఇలా పాకుతూ వచ్చిన పామును ఆ స్నేక్ క్యాచర్ తన సంచిలో బంధిస్తాడు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్ తాలూకాలోని షెజ్‌వాడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News