Restaurant Style Mutton Recipe: ఎప్పుడూ ఒకే రకంగా తయారు చేసుకునే మటన్ కర్రీతో బోర్ కొడుతుందా? ఈసారి రెస్టారెంట్ స్టైల్ లో ముక్క నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా మెత్తగా మటన్ తయారు చేసుకోండి. ఆదివారం పార్టీలు ఫంక్షన్ ఏ ప్రత్యేక దినాల్లో అయినా మటన్ తప్పకుండా ఉండాల్సిందే. అంతేకాదు తెలంగాణ స్టైల్ లో ఈ మటన్ కర్రీ తయారు చేసుకుంటే అందరూ లొట్టలు వేసుకొని తింటారు. తాజా మటన్ కర్రీ తీసుకువచ్చి దానికి మంచి మసాలా దట్టించి ఘుమఘుమలాడుతూ వచ్చే ఆరోమా నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లలో ఈ ఘుమఘుమల సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. అయితే పర్ ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
మటన్ -అరకేజీ
ధనియాల పొడి-2 టేబుల్ స్పూన్లు
పసుపు -టేబుల్ స్పూన్
కారం- టేబుల్ స్పూన్
కాశ్మీరీ చిల్లీ పౌడర్- అర టీ స్పూన్
జీలకర్ర - టేబుల్ స్పూన్
యాలకులు-టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి తాజా
ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి
పుదీనా కొత్తిమీర కరివేపాకు
మరాఠీ మేతి
ఉప్పు
కూరకు తగిన నూనె
జీడిపప్పు.
ఇదీ చదవండి: Robos: ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. రంగంలోకి రోబోలు కార్మికులను వెలికితీసే కీలక ఘట్టం..
రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా తయారీ విధానం..
ముందుగా మటన్ బాగా శుభ్రం చేసి ఓ గంట పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఇలా చేస్తే ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. వీలైతే ఇంకాస్త ఎక్కువసార్లు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి యాలకులు లవంగా, కొన్ని మిరియాలు బిర్యానీ ఆకు, పువ్వు వేసి కాస్త వేయించాలి. వీటిలో నుంచి మంచి అరోమా వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఉల్లిపాయలు వచ్చాక కాస్త మరాఠీ మేతి కరివేపాకు, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర బాగా కడిగి వేసుకోవాలి... ఇప్పుడు ఇందులో మటన్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
ఇదీ చదవండి: SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో...
ఇప్పుడు కారం కాశ్మీరీ, చిల్లి పౌడర్ ఉప్పు, ధనియాలు, జీలకర్ర తయారు చేసిన పొడి కూడా వేసి బాగా కలిపి మీడియం మంటపై ఉడికించాలి. ఓ పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి కాస్త వేడి చేసిన నీళ్లు అందులో పోసి ముక్కలు సగం ఉడికే వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పును నూనెలో వేయించి మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేసుకుని ఈ కూరలో వేసుకోవాలి. ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా జల్లుకుంటే ఘుమఘుమలాడిపోయే రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయినట్లే.. ఇది అన్నం చపాతీలకు ఎంతో బాగుంటుంది. ఇందులో మీరు జీడిపప్పు పేస్టు బదులుగా కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









