Winter Season: వెచ్చదనం కోసం రూమ్ హీటర్ వాడుతున్నారా..?.. ఈ తప్పులు చేస్తే డెంజర్‌లో పడ్డట్లే.!.

Room heater side effects: చాలా మంది రాత్రిళ్లు రూమ్ హీటర్ పెట్టేసి అలానే నిద్రపోతారు. కొన్ని సందర్బాల్లో వీటి నుంచి శ్వాసకు ఇబ్బంది కల్గించే వాయువులు విడుదలౌతాయని నిపుణులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 05:56 PM IST
  • రూమ్ హీటర్ పై పలు సూచనలు..
  • రాత్రిపూట జాగ్రత్తలు చెప్పిన నిపుణులు..
Winter Season: వెచ్చదనం కోసం రూమ్ హీటర్ వాడుతున్నారా..?.. ఈ తప్పులు చేస్తే డెంజర్‌లో పడ్డట్లే.!.

Room heater causing these side effects in winter season: కొన్నిరోజులుగా దేశ వ్యాప్తంగా చలి చంపేస్తుంది.  ఎక్కడ చూసిన కూడా ఉష్ణోగ్రతలకు సింగిల్ డిజిట్ కు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా చలి వల్ల జనాలు గజ గజ వణికిపోతున్నారు.   చిన్న పిల్లలు, వయసులో పెద్దవారు  చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చలిగాలుల వల్ల బైటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి పదార్థాలను తింటు, వెచ్చగా ఉండేలా దుస్తులు వేసుకొవాలని పలు సూచనలు చేస్తున్నారు. అయితే చాలా మంది తమ ఇళ్లలో చలి నుంచి బైటపడేందుకు రూమ్ హీటర్ లను ఉపయోగిస్తారు.

Add Zee News as a Preferred Source

 రూమ్ హీటర్ ను అతిగా వాడటం వల్ల ప్రాణాలు పోయే సిట్యువేషన్ కూడా కొన్నిసార్లు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.రూమ్ హీటర్ ల నుంచి  కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడుతుంది. అదే విధంగా మరీ ఎక్కువగా కాయిల్ వేడి కావడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ కూడా వెలువడుతుందంటారు. ఇది గదిలోని తేమను దూరం చేస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ సరఫరాలకు అంతరాయం కలిగేలా చేస్తుందంట.

దీని వల్ల చర్మం పొడిబారిపోయి, శ్వాస కోశ సమస్యలు ఏర్పడతాయి. మరికొంత మంది చలికాలంలో బొగ్గుల కుంపటిని బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు. దీని వల్ల రూమ్ అంతా వేడిగా ఉంటుందని భావిస్తారు. కానీ దీని వల్ల కూడా విషవాయువులు గది అంతా వ్యాపించి అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని నిపుణులు చెబుతున్నారు.

Read more: Lionel Messi Dating: ఫుట్ బాల్ లోనే కాదూ.. రొమాన్స్‌లోను గొప్ప ఛాంపియన్.!. లియోనల్ మెస్సీ డేటింగ్ హిస్టరీ తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా.. వీటితో డెంజర్ తప్పదని చెప్తున్నారు. అందుకే రూమ్ లో ఎక్కువగా హీటర్ లను వాడకుండా  కొద్దిసేపు ఆన్ ఉంచి మరల ఆఫ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.  మొత్తంగా రూమ్ హీటర్ వల్ల చలి నుంచి సెఫ్టీతో పాటు కొద్దగా రిస్క్ కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News