Sabja Seeds: సబ్జా విత్తనాల నీటిని పరిగడుపునే తాగితే ఏమవుతుందో తెలుసా?

Sabja Seeds Benefits: ప్రతిరోజు సబ్జా విత్తనాలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇందులో ఉంటే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరాన్ని శక్తివంతంగా చేయడమే కాకుండా జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 09:10 PM IST
Sabja Seeds: సబ్జా విత్తనాల నీటిని పరిగడుపునే తాగితే ఏమవుతుందో తెలుసా?

Sabja Seeds Benefits: సబ్జా విత్తనాలు రోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది. ఈ విత్తనాల్లో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె సమస్యలు ఉన్న వారి ప్రతిరోజు సబ్జా విత్తనాలు నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అలాగే కొవ్వును కరిగించేందుకు కూడా ఈ సబ్జా విత్తనాలు ఎంతగానో సహాయపడతాయి. ఇవే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సబ్జా విత్తనాలు నీటిని అల్పాహారముకు ముందు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి..

Add Zee News as a Preferred Source

సబ్జా విత్తనాల వల్ల కలిగే లాభాలు: 
శరీర వేడిని తగ్గించడం: ఎండాకాలంలో సబ్జా విత్తనాలు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి శాతం తగ్గుతుంది.. అంతేకాకుండా సజ్జలో ఉండే గుణాలు శరీరాన్ని చలువ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎండల్లో ఎక్కువగా తిరిగేవారు సబ్జా విత్తనాలతో తయారు చేసిన లెమన్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం ఎంతో మంచిది.

శరీర బరువు నియంత్రణకు:
ఎండాకాలంలో సబ్జా నీటిని తాగడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు. ఇందులో లభించే ఫైబర్ ఆకలిని నియంత్రించి పొట్టను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే అనారోగ్యకరమైన జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

మలబద్ధకం నుంచి ఉపశమనం: 
పుష్కలంగా ఫైబర్ ఉన్న విత్తనాల్లో సబ్జా ఒకటి. ఇందులో లభించే ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేసి అనేక రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు తప్పకుండా సబ్జా విత్తనాలు నానబెట్టిన నీటిని తాగడం ఎంతో మేలు. 

రక్తంలో చక్కెర స్థాయిలు: 
సబ్జా విత్తనాల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇది రక్తంలోని చక్కెర విడుదలను నిమ్మదించేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు సబ్జా గింజల నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా నియంత్రించుకోవచ్చు. 

చర్మం, జుట్టు ఆరోగ్యానికి: 
సబ్జా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పటికే చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ సబ్జా విత్తనాలు నానబెట్టిన నీటిని తాగడం మంచిది. ఇందులో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి దీనివల్ల శరీరానికి, జుట్టు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News