Kitchen Clean Tips: వంటకు ఉప్పు రుచిని అందిస్తుంది. అదే ఉప్పు ఇంటికి శుభ్రతను తీసుకొస్తుంది. లవణం ఇంటిని అందంగా తయారుచేస్తుంది. ఇంట్లోని మరకలు, చెడు వాసనలను తొలగించడంలో సమర్థంగా ఉప్పు పని చేస్తుంది. ఇనుప సామగ్రికి పట్టిన తుప్పును వదలగొట్టడంలో ఉప్పు అద్భుతంగా పని చేస్తుంది. రసాయనాలు లేకుండానే ఇంటిని ఉప్పు తళతళా మెరిపిస్తుంది. బజ్జీలు, పూరీలు వేయించుకునే ఇనుప కడాయిలు ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే తుప్పుపట్టి పోతాయి. వాటిని వాడాల్సిన సమయంలో కడగాలంటే పెద్ద శ్రమ. ఆ సమయంలో ఉప్పును వాడితే తుప్పు పట్టిన కడాయి మెరిసిపోతుంది. తుప్పు పట్టిన కడాయిపై కొద్దిగా ఉప్పు నీటితో స్ప్రే చేయాలి. అనంతరం 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడిబట్టతో తుడిచేస్తే కడాయికి ఉన్న తుప్పు వదిలిపోతుంది.
Also Read: Pavel Durov 100 Kids: పెళ్లి కాకుండానే 40 ఏళ్లకు 100 మంది పిల్లలకు తండ్రి.. ముగ్గురితో డేటింగ్
ఉప్పుతో ఇలా చేయాలి
==> వంటపాత్రలపై జిడ్డు, ఆహారపు మరకలను ఉప్పు పోగొట్టేస్తుంది. జిడ్డు, మరకలు ఉన్న పాత్రలపై కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కొన్ని నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగి తుడిచేస్తే జిడ్డు మాయమైపోతుంది.
==> కిచెన్‌తోపాటు ఇతర సింక్‌లో ఆహార వ్యర్థాలు మిగిలిన చోట దుర్వాసన వ్యాపిస్తుంది. దుర్వాసన రాకుండా ఉప్పునీరు చక్కటి పరిష్కారంగా పని చేస్తుంది. సింక్‌పైన కొంత ఉప్పు చల్లి ఆపై చల్లని నీళ్లు పోసి కడిగేయాలి. మరకలు తొలగిపోవడమే కాకుండా సింక్ మెరిసిపోయి దుర్వాసన బాధ తగ్గిపోతుంది.
Also Read: Immune System: ఈ టిప్స్ పాటిస్తే 100 ఏళ్లు బతికేస్తారు.. అద్భుతమైన టిప్స్ ఇవే!
==> ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటు పదార్థాలు కట్ చేసిన తర్వాత చేతులకు వాసన ఉండిపోతుంది. కొన్ని గంటలైనా వాసన పోదు. చాలాసేపటి వరకూ చేతులకు ఆ వాసన ఉంటుంది. ఉప్పు నీటితో చేతులను కడిగేస్తే చేతులకు ఘాటు వాసనలు దూరమవుతాయి.
==> ఇంటి శుభ్రతలో ఉప్పును వినియోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే మరింత శుభ్రంగా మారుతుంది. ఉప్పు నీటితో తుడువడం వల్ల దుర్వాసన కూడా తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









