Sapota Fruit Benefits In Telugu: చాలామంది సపోటా పండ్లను తినేందుకు అంతగా ఇష్టపడరు. నిజానికి ప్రతిరోజు ఉదయం పూట సపోటా పండ్లను తింటే ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సపోటా పండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులో పీచుపదార్థం (ఫైబర్), పిండిపదార్థము (కార్బోహైడ్రేట్లు), మాంసకృతులు (ప్రోటీన్) కూడా లభిస్తాయి. రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. సపోటా పనులలో కాల్షియం, మేగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజు ఉదయాన్నే ఈ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి:
రోజు ఉదయాన్నే సపోటా పండ్లను తినడం వల్ల అందులో ఉండే సుక్రోచ్, ఫ్రక్టోజ్ శరీరానికి శక్తిని అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇందులో సహజ చెక్కర కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం సమస్య:
సపోటాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది దీంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తరచుగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సపోటా పండ్లను తినడం చాలా మంచిది.
యాంటీ ఆక్సిడెంట్స్:
సపోటాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా.. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువు తగ్గడానికి..
అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా సపోటా తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ పొట్టను హెల్తీగా చేసి నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనివల్ల తినాలనే భావన కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో సులభంగా బరువు కూడా తగ్గొచ్చని వారు అంటున్నారు.
ఎముకల సమస్యలకు..
సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సపోటా పండ్లను జ్యూసులా తయారు చేసుకుని తాగడం వల్ల కూడా ఎముకలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రక్తపోటు సమస్యకు..
అధ్యయనాల ప్రకారం సపోటా పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నివారించేందుకు కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుతో పాటు గుండె సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఉదయం పూట ఈ పండ్లను తినడం ఎంతో మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









