
Sapota Health Benefits: ఎండాకాలం వేళ కాస్త శక్తి అందించే పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. ఈ నేపథ్యంలో సపోటా పండును డైట్ లో చేర్చుకుంటే అనే కారక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా ఇది ఎముకలను బలపరుస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది సపోటా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
రెగ్యులర్ డైట్లో ఈ సపోటా పండు తీసుకోవటం వల్ల కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. కాబట్టి ఇది కంటి ఆరోగ్యకరమైన పనితీరుకు మేలు చేస్తుంది. వయసు రిత్యా వచ్చే కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది సమతుల ఆహారం అవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి విటమిన్ ఇ, జింక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది.
అంతేకాదు సపోటా పండులో ఉండే విటమిన్ ఏ రేచీకటి సమస్యలను కూడా నయం చేస్తుంది. తీపిగా ఉండే ఈ పండును క్యారెట్, చిలకాడ దుంప, పాలకూరతో కలిపి తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇది సమతుల ఆహారం అవుతుంది .
సపోటా పండు ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకకు ఎంతో మంచిది. దీంతో బోన్స్ బలంగా మారిపోతాయి. విటమిన్ డి మెగ్నీషియం ఉండటం వల్ల ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
సపోటా పండు రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఇది విటమిన్ డి అందుతుంది. ఇది పాలలో.. సూర్య కిరణాలలో మాత్రమే కలిగి ఉంటుంది. విటమిన్ డి కావాలంటే సపోటా పండును తీసుకోవడం అలవాటు చేసుకోండి.
సపోటా పండులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. కాబట్టి కడుపు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ. అంతేకాదు మంచి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. తద్వారా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు రాకుండా ఉంటాయి.
అయితే సపోటా ఒకటి మాత్రం తీసుకోవడం వల్ల శరీరానికి సమతుల ఆహారం కాదు. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండాలి. తద్వారా మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. కేవలం ఒక పండు మాత్రమే ఆధారపడి ఉండకూడదు. దీనికి అనుగుణంగా మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. అంటే కంటి ఆరోగ్యానికి, ఎముకలకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎంతో మంచిది. అంతే కాదు స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా మంచి పోజిషన్ ఉండాలి. అప్పుడప్పుడు ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి