Scalp Health Kitchen Ingredients: కుదుళ్లు ఆరోగ్యం బాగుంటేనే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా వేధించదు. హెయిర్ ఫాల్ సమస్యకు మంచి చెక్ పెట్టవచ్చు. అయితే వంట గదిలో ఉండే ఈ పది వస్తువులను జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కేవలం కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోయి. చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కొబ్బరి నూనె మన బామ్మల కాలం నాటి నుంచి వినియోగిస్తున్నాము. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. కుదుళ్లు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. పొడిబారకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉన్నాయి.
కలబంద కూడా మంచి పోషకాలు కలిగి ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి హైడ్రేషన్ కూడా అందిస్తుంది. దురదలను తగ్గిస్తుంది, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది.
టీ ట్రీ ఆయిల్ కూడా పవర్‌ఫుల్ యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంది. ఇది డాండ్రఫ్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. తద్వారా జుట్టుపై ఉండే దురదను తగ్గిచేస్తుంది. అదనపు నూనెను గ్రహిస్తుంది. షాంపూ లేదా కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్‌లో కలిపి జుట్టుకు అప్లై చేయాలి.
యాపిల్ సైడర్ వెనిగర్ (ACV) కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కుదుళ్లను కూడా సమతులను చేస్తుంది. దీంతో డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది.
రోజ్మెరీ ఆయిల్ కూడా ఎక్కువ మంది ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. కుదుళ్ల ఆరోగ్యం బాగుండాలంటే రోజు మీరు రోజ్మెరీ ఆయిల్ ఉపయోగించండి. ఇందులో యాంటీ మైక్రోబియాల్ గుణాలు ఉంటాయి. కుదుళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి.
వేపలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటానాయి. ఇది డాండ్రఫ్ సమస్యను తగ్గిస్తుంది. వేపాకును ఉడకబెట్టి జుట్టుకు ఉపయోగించటం వల్ల కుదుళ్ల ఆరోగ్యం బాగుంటుంది. వీటితో హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.
వీటితోపాటు ఉల్లిపాయ రసం కూడా జుట్టుకు ఉపయోగించాలి. ఇది జుట్టును బలంగా మారుస్తుంది. హెయిర్ ఫాలికల్ డామేజ్ కాకుండా ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. తద్వారా కుదుళ్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాయి.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది డాండ్రఫ్ తో తగ్గిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ ను బలంగా మారుస్తుంది. ఇందులో ఇన్‌ఫ్లమేషన్ సమస్య కూడా తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. తద్వారా కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది.
ఇక మెంతులు కూడా జుట్టు ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. ఇది నేచురల్ కండిషనర్ల కూడా పనిచేస్తుంది. డ్యాండ్రాఫ్ రాకుండా వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా మారుస్తుంది.
READ ALSO: బీఎస్‌ఎన్‌ఎల్ 6 నెలల వరకు రీఛార్జీ తలనొప్పి ఉండదు.. కేవలం రూ.900 లోపే, అపరిమిత కాలింగ్, డేటా..
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి కాస్త ఆర్థిక ఇబ్బందులు, వీరికి ఉద్యోగ బాధ్యతలు పెరగవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









