)
Seeds For Strong Muscles: ప్రధానంగా మన డైట్ లో ఆరోగ్యకర ఆహారం చేర్చుకోవాలి. తద్వారా ఎముకలు, పళ్ళు, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతాయి. చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. అయితే మన డైట్ లో కొన్ని రకాల విత్తనాలు చేర్చుకోవడం వల్ల శరీరారోగ్యం బాగుంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఖనిజాలు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రధానంగా చియా విత్తనాలు, ఫ్లాక్ సీడ్స్ మన మెదడు పని తీరుకు ఎంతో మెరుగు చేయడానికి సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా తోడ్పడుతాయి.
ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించే గుణం కలిగి ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. విత్తనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి కండరాల అభివృద్ధికి రిపేర్ కి కూడా ఇది ఎంతగానో సహకరిస్తాయి. మన రెగ్యులర్ డైట్ లో విత్తనాలను చేర్చుకోవడం వల్ల మెదడు అభివృద్ధి కూడా మెరుగవుతుంది. స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.
అవిస గింజలు..
మన రెగ్యులర్ డైట్ లో అవిసె గింజలు చేర్చుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పోషక ఆహారం అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ను కూడా తగ్గిస్తుంది.
సన్‌ఫ్లవర్ సీడ్స్..
సన్ ఫ్లవర్ సీడ్స్ ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి. అంతే కాదు ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఈ విత్తనాలు మన శరీర ఆరోగ్యానికి మంచిది. సాయంత్రం స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నువ్వులు..
నువ్వులు మన బామ్మల కాలం నాటి నుంచి వంటలు వినియోగిస్తారు. ఈ నువ్వుల ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కలిగి ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి. మన రెగ్యులర్ ఆహారాల్లో ఈ నువ్వులు వేసుకొని తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook